BigTV English

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Amazon Great Indian Festival Sale 2024 : ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మా అమెజాన్ ఇటీవల ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ఈ నెల అంటే సెప్టెంబర్ 27న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, గృహోపకరణాలతో సహా ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.


అంతేకాకుండా ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు భారీ బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMIలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందుతారు. ఇక సేల్‌ స్టార్ట్ కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. దీంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ OnePlus 11R, Samsung Galaxy S21 FE వంటి స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన కిక్‌స్టార్టర్ డీల్‌ను ప్రకటించింది. ధరల తగ్గింపుతో పాటు, డెబిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపులను అందించడానికి అమెజాన్ SBIతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో భాగంగానే వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపులు అందిస్తున్నట్లు ప్రకటించింది.

OnePlus 11R Kickstarter Deals


వన్‌ప్లస్ 11ఆర్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర భారతదేశంలో రూ. 39,999 గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని రూ.27,999కి కొనుక్కోవచ్చు. అంటే ఏకంగా రూ.12,000 తగ్గింపు లభిస్తుందన్న మాట. అదే సమయంలో కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందుతారు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ. 26,749కి సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Samsung Galaxy S21 FE Kickstarter Deals

ఈ ఫోన్‌తో పాటు Samsung Galaxy S21 FE ఫోన్‌పై కిక్‌స్టార్టర్ డీల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సమయంలో రూ.74,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అప్పటి ఈ ఫోన్‌పై ఎన్నో డిస్కౌంట్లు ప్రకటించబడ్డాయి. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సందర్భంగా కూడా ఈ హ్యాండ్‌సెట్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీనిని భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.26,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఇది 6.4-అంగుళాల డైనమిక్ AMOLED 2X 120Hz డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో OnePlus Nord CE 4 Lite 5G ఫోన్ అసలు ధర రూ.20,999కి అందుబాటులో ఉండగా.. అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి రూ.17,999కి కొనుక్కోవచ్చు. ఇది 80W SuperVOOC ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 27న అధికారికంగా ప్రారంభం కాగా.. అంతకంటే ముందురోజు సెప్టెంబర్ 26న ప్రైమ్ మెంబర్‌లకు అందుబాటులోకి వస్తుంది.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×