BigTV English

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Jani Master : ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక మైనర్ కొరియోగ్రాఫర్ పై గత కొన్ని నెలలగా లైంగిక దాడి చేస్తున్న విషయం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగింది. దీనితో ఈ కేసు ఒక సంచలనాత్మకంగా మారింది. సదరు బాధితురాలు జానీ మాస్టర్ పై అనేక ఆరోపణలు చేసింది. బాధితురాలపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయస్సు 16 సంవత్సరాలు. అయితే పలుమార్లు తనపై లైంగికంగా దాడి చేసినట్లు ఆమె తెలిపింది.


డాన్సర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఆమె జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. అయితే వర్షిని అనే ఒక అమ్మాయి ద్వారా వచ్చిన ఫోన్ కాల్ తో జానీ మాస్టర్ దగ్గర తను చేరినట్లు పోలీసుల దగ్గర బాధితురాలు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అలవైకుంఠపురంలో సినిమాలోని ఒక పాట కొరియోగ్రఫీ కోసం జానీ మాస్టర్ ఈ బాధితురాలు కూడా ముంబై తీసుకెళ్ళి అక్కడ పలుమార్లు లైంగికంగా దాడి చేశారు అంటూ పోలీసుల దగ్గర చెప్పుకొచ్చింది. అయితే ఈ సంచలమైన విషయాలు బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఇప్పటివరకు బయట కనిపించలేదు. ఎట్టకేలకు జానీ మాస్టర్ ను పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు.

The Grand Leoney Resort


 

కొరియోగ్రాఫర్ గా జానీ మంచి పేరు ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా జానీ గుర్తింపు సాధించుకున్నాడు. అయితే ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి జానీ ఎక్కడ బయట కనిపించలేదు.  ఇక రీసెంట్గా జానీ పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని పోలీసులు పట్టుకున్నారు. ది గ్రాండ్ లియోని రిసోర్ట్ వాగటూర్ గోవాలో జానీ దొరికాడు. ఆ తర్వాత జానీ ని గోవా మెజిస్టిక్ ముందు పోలీసులు హాజరు పరిచినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆ హోటల్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జానీ మాస్టర్ నివసించిన ఈ హోటల్ చాలా గ్రాండ్ గా ఉంది.  చాలా ప్రైవేట్ రూమ్స్ తో పాటు భారీ స్విమ్మింగ్ పూల్ తో ఈ రిసార్ట్ కనిపిస్తోంది.  అలానే బీచ్ కి కేవలం ఎనిమిది నిమిషాల్లో చేరిపోయేంత దగ్గరలో ఈ రిసార్ట్ ఉంది.

The Grand Leoney Resort

ఇక జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే ఆరోపణలన్నీ నిజమని జానీ మాస్టర్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దానికి సపోర్ట్ చేసిన ఇంకొంతమంది కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం జానినీ చంచల్ కూడా జైలుకు తరలించారు. ఇకపోతే కొంతమంది ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పటివరకు ఎందుకు దాచి ఉంచారు దీని వెనక ఏదో జరుగుతుంది అంటూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఈ కేసు గురించి మరికొన్ని రోజుల్లో కంప్లీట్ డీటెయిల్స్ బయటకు రానున్నాయి.

The Grand Leoney Resort, Vagator

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×