BigTV English

Amazon Great Indian Festival Sale 2024: రూ.8,999లకే 5జీ ఫోన్లు.. రూ. 6,999లకే స్మార్ట్‌టీవీలు, అమెజాన్ న్యూస్ అదిరిపోయింది!

Amazon Great Indian Festival Sale 2024: రూ.8,999లకే 5జీ ఫోన్లు.. రూ. 6,999లకే స్మార్ట్‌టీవీలు, అమెజాన్ న్యూస్ అదిరిపోయింది!

Amazon Great Indian Festival Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేల్ ప్రకటిస్తూ ఉంటుంది. సేల్ సమయంలో కనీ వినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్లు ప్రకటించి ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్స్, హోమ్, ఫ్యాషన్ సహా ఇతర ప్రొడెక్టులపై అద్భుతమైన తగ్గింపులను అందించి ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలా సేల్స్‌ను తీసుకొచ్చి సర్‌ప్రైజ్ తగ్గింపులతో దూసుకుపోయిన అమెజాన్.. తాజాగా మరో అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే తన ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్’ తేదీని అధికారికంగా ప్రకటించింది.


ఈ సేల్ ఈ నెల అంటే సెప్టెంబర్ 27 నుంచి అఫీషియల్‌గా ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ సేల్ ప్రైమ్ మెంబర్ల కోసం సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రైమ్ మెంబర్స్ ముందుగా అన్ని ప్రొడక్టులను డిస్కౌంట్లతో కొనేయొచ్చు. ఆ తర్వాత రోజు నార్మల్ మెంబర్లకు ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే అమెజాన్ సేల్ ప్రారంభ తేదీని ప్రకటించింది కానీ ముగింపు తేదీని వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సేల్ వచ్చే నెల అంటే అక్టోబర్ వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఈ సేల్‌లో భారీ తగ్గింపులు, ఈఎంఐ ఆప్షన్లు, నో కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సమయంలో కస్టమర్లు 5జీ ఫోన్లను చాలా చీప్ ధరకే పొందగలుగుతారు. ఈ సేల్ సమయంలో 5జీ మొబైళ్లతో పాటు యాక్ససరీలపై దాదాపు 40 శాతం వరకు డిస్కౌంట్ పొందుతారు. అదే సమయంలో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.8,999 నుండి ప్రారంభం అవుతుందని సమాచారం.


Also Read: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

అలాగే ఇతర ప్రొడక్టులపై కూడా కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు పొందవచ్చు. హూమ్, కిచెన్, ఫైర్ టీవీలపై సగం డిస్కౌంట్ పొందొచ్చు. అంటే 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుందన్నమాట. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ వస్తువులైన అలెక్సా, ఫైర్ టీవీ వస్తువులపై 55 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీ, ప్రొజెక్టర్‌పై దాదాపు 65 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. రాబోయే సేల్‌లో స్మార్ట్ టీవీలు కేవలం రూ. 6,999 నుండి ప్రారంభమవుతాయి. అయితే టీవీ కొనే సమయంలో దాదాపు 3 సంవత్సరాల వరకు పొడిగించిన వారంటీ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటన్నింటితో పాటు హోమ్ అప్లయెన్సెస్, అలాగే చిన్న – మధ్యతరహా బిజినెస్‌లపై 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

అలాగే స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 75 శాతం వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. అదే సమయంలో స్మార్ట్ వాచ్‌లు రూ. 799 నుండి ప్రారంభమవుతాయి. ఇతర ఆఫర్లలో నోకాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, రూ.65,000 వరకు ఆదా చేసుకునే వీలు ఈ సేల్‌లో ఉంది. ఇక వీటిపై బ్యాంక్ డిస్కౌంట్లు సైతం పొందొచ్చు. SBI క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌లు, ఇంకా EMI ట్రాన్షక్షన్లపై 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి అమెజాన్ SBIతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా Amazon Pay UPI ద్వారా కనిష్టంగా రూ. 1000 ఆర్డర్‌తో ఫ్లాట్ రూ. 100 క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×