BigTV English

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Road Accident: ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి.. 30 మందికి తీవ్ర గాయాలు!

Road Accident in vijayanagaram two killed: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వెంటనే తోటి వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి విజయనగరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

డెంకాడ మండలం మోదవలస వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో విజయనగరానికి చెందిన మనోజ్(27), విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన శ్యామ్ కుమార్(33) ఉన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉండగా, అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. రామాపురం మండలంలోని మేదరపల్లి చెక్ పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సిమెంట్ లారీ, బస్సు రోడ్డు అడ్డంగా పడిపోయాయి. దీంతో కడప, రాయచోటి మార్గంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Also Read: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.

Related News

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Big Stories

×