BigTV English

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Amazon Great Indian Festival 2024 Sale: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈ నెల అంటే సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తాజాగా అధికారికంగా వెల్లడించింది. అయితే దానికంటే ముందు ప్రైమ్ మెంబర్స్‌కి సెప్టెంబర్ 26 నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది.


ఈ సేల్‌లో కస్టమర్లు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను పొందుతారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, ఫ్యాషన్ సహా ఇతర ప్రొడక్టులపై ఊహకందని డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ మేరకు అమెజాన్ సేల్‌కు సంబంధించి కొత్త డేట్‌ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ కార్డుపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు అని తెలిపింది. అలాగే నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఫ్లాట్ 100 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారని తెలిపింది.

ముఖ్యంగా రియల్‌మి, పోకో, శాంసంగ్, వివో, వన్‌ప్లస్ సహా ఇతర బ్రాండ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. ముఖ్యంగా ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లు అయిన వన్‌ప్లస్ నార్డ్ సిఈ4 లైట్, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 సహా ఇతర వన్‌ప్లస్ మోడళ్లపై తగ్గింపులు పొందవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు ఐఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.


Also Read: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!

ఇందులో భాగంగానే ఈ సేల్‌లో ఐఫోన్ 13 బేస్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ.38,999లకే ఐఫోన్13ను కొనుక్కోవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలో అందించనుంది. ఇదే నిజం అయితే ఎప్పట్నుంచో ఐఫోన్‌ను కొనుక్కోవాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవాలి. కాగా ఈ ఐఫోన్ 13 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డిఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 12 ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది.

ఇక ఈ సేల్‌లో భాగంగా ఐక్యూ 12, ఐక్యూ నియో 9ప్రో, ఐక్యూ జెడ్9, ఐక్యూ జెడ్9 ఎస్ ప్రో అలాగే శాంసంగ్ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎం15 సహా ఇతర మోడళ్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. వీటితో పాటు హానర్, టెక్నో, ఒప్పో వంటి ఇతర బ్రాండ్‌లను కూడా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇక ఏ ప్రొడక్టులపై ఎంత శాతం డిస్కౌంట్ వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్‌ఫోన్ల యాక్ససరీలపై 80శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

అదే సమయంలో ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, రిఫ్రిజిరేటర్‌లపై 55 శాతం, ఎయిర్ కండీషనర్‌లపై 55 శాతం, వాషింగ్ మెషిన్‌లపై 60 శాతం వరకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. అలాగే ఈ సేల్‌లో భాగంగా హెడ్‌ఫోన్స్‌ను రూ.699 నుంచే కొనుక్కోవచ్చు. అలాగే స్మార్ట్‌వాచ్‌లను రూ.799 నుంచి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు స్పీకర్లు, స్మార్ట్‌టీవీలను తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×