BigTV English

Huge Discount on iPhone: ఐఫోన్‌పై బెస్ట్ డీల్.. రూ.30 వేల డిస్కౌంట్.. వదిలితే కష్టమే గురూ!

Huge Discount on iPhone: ఐఫోన్‌పై బెస్ట్ డీల్.. రూ.30 వేల డిస్కౌంట్.. వదిలితే కష్టమే గురూ!

Rs 30,000 Discount on iPhone 13: అమోజాన్ ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. సేల్‌లో భాగంగా భారీ డీల్స్‌ను అందించబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి జాబిజాను విడుదల చేయనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల నుంచి గృహోపకరణాల వరకు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సగం ధరలకే అనేక వస్తువులను అందించనుంది అమోజాన్. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ 13పై ప్రత్యేకమైన తగ్గింపును అమోజాన్ ప్రకటించింది. ఈ డీల్‌లో మీరు రూ. 47,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. కాబట్టి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ప్రస్తుతానికి అమోజాన్ iPhone 13ని ప్లాట్‌ఫామ్‌లో రూ. 49,300కి విక్రయిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.59,900. అంటే ప్రైమ్ డే సేల్ ప్రారంభమైనప్పుడు దీనిపై అదనపు బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.  ఐఫోన్ 13 మూడు స్టోరేజ్ వేరియంట్‌లు, 6 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఐఫోన్ 13 2022లో రూ. 79,900 ధరతో విడుదలైంది. లాంచ్ ధరను బట్టి చూస్తే, ఫోన్ రూ.30 వేలకు పైగా తగ్గింపును పొందవచ్చు.

Also Read: Amazon Limited Offer: లిమిటెడ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్.. త్వరగా ఫినిష్ చేయండి!


ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ 2532X1170 పిక్సెల్‌ల రిజల్యూషన్, 460ppi పిక్సెల్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 13 A15 బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో 128GB, 256GB, 512GB వేరియంట్‌లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ iOS 15 అవుట్ ది బాక్స్‌తో లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం ఇది iOS 17తో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 13 వెనుక 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో పవర్ కోసం 3240mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Itel Color Pro 5G: ఊసరవెళ్లి ఫోన్.. రంగులు మార్చేస్తుంది.. ధర చాలా తక్కువ!

ఐఫోన్ 13 సేల్‌కు వచ్చిన ఒక సంవత్సరం తర్వాత కంపెనీ 2023లో ఐఫోన్ 14ను విడుదల చేసింది. రెండు ఫోన్‌ల మధ్య చాలా ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. అలాగే వాటి రిజల్యూషన్, స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్ కూడా అలాగే ఉంటాయి. రెండు ఫోన్‌ల డిజైన్ సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. వాటిని కలిపి ఉంచినప్పుడు వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. iPhone 13, 14 రెండూ 5G కనెక్టివిటీని అందిస్తాయి. రెండు A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఉంటాయి. iPhone 14 అదనంగా GPU స్లాట్‌ను కలిగి ఉంది.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×