E-Paper
Advertisement

Itel Color Pro 5G Mobile: ఊసరవెళ్లిల రంగులు మార్చే స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే..!

Itel Color Pro 5G Mobile: ఊసరవెళ్లిల రంగులు మార్చే స్మార్ట్ ఫోన్.. ధర కూడా చాలా తక్కువే..!
Advertisement

Itel Color Pro 5G Mobile: బడ్జెట్ ఫోన్లకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మార్కెట్‌లో టెక్ కంపెనీలు స్పెషల్ ఫోకస్ చేశాయి. అంతేకాకుండా తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మార్ట్‌మేకర్ ఐటెల్ కొత్త టెక్నాలజీతో ఐటెల్ కలర్ ప్రో 5జీని  విడుదల చేసింది. ఫోన్ చాలా అకర్షణగా, రంగులు మారుతున్న బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

ఫోన్ IVCO (ఐటెల్ వివిడ్ కలర్) టెక్నాలజీతో వస్తుంది. దీని కారణంగా సూర్యకాంతిలో ఫోన్ రంగు మారుతుంది. ఇది మాత్రమే కాదు ఫోన్ NRCA (5G++)కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది బలహీనమైన నెట్‌వర్క్‌లు ఉన్న ప్రాంతాల్లో కూడా బలమైన 5G కనెక్టివిటీని అందిస్తుంది. ఫోన్‌లో MediaTek Dimension ప్రాసెసర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

ఐటెల్ కలర్ ప్రో 5G కేవలం 6GB RAM+ 128GB స్టోరేజ్ ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.9,999. ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు కంపెనీ కొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ (రూ. 2,000), డఫెల్ బ్యాగ్ (రూ. 3,000 విలువ) ఉన్నాయి. ఫోన్‌ని కొనుగోలు చేసిన 100 రోజుల్లోపు డిస్‌ప్లే చెడిపోతే ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ చెబుతోంది. లావెండర్ ఫాంటసీ, రివర్ బ్లూ షేడ్స్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Also Read: Offers on iPhone 15 Pro : లక్కీ ఆఫర్.. ఐఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ ఎపుడు చూసుండరు!

Advertisement

itel Color Pro 5G Specifications
ఐటెల్ కలర్ ప్రో 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఫోన్ 6.6-అంగుళాల HD ప్లస్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600×720 పిక్సెల్ రిజల్యూషన్, 90 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6080 ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ ఫోన్ AnTuTu స్కోర్ 4,29,595 అని కంపెనీ పేర్కొంది. ఫోన్ స్టాండర్డ్ 6GB RAMని కలిగి ఉంది. అయితే ఇది 6GB వర్చువల్ RAMకి సపోర్ట్ ఇస్తుంది. మొత్తం RAMని 12GBకి పెంచుకోవచ్చు. ఫోన్‌లో 128GB స్టోరేజ్ కూడా ఉంది.

Also Read: Mobile Offers: డిస్కౌంట్లు, ఆఫర్లు.. సామ్‌సంగ్ 5జీ ఫోన్లపై బిగ్ డీల్స్!

ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఉంది. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ ఐడి కూడా ఉన్నాయి. ఫోన్‌లో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS, ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ 10 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది NRCA (5G++) టెక్నాలజీకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది బలహీనమైన సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా బలమైన 5G కనెక్టివిటీని అందిస్తోంది. నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నప్పుడు 4Gకి మారే ఇతర సిస్టమ్‌ల మాదిరిగా కాకుండా NRCA బలమైన 5G కనెక్షన్‌ను నిర్వహిస్తుంది. వేగవంతమైన బ్రౌజింగ్, బలమైన కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×