E-Paper
Advertisement

Apple Product Offers : ఆండ్రాయిడ్ ఎందుకు దండగ.. ఏకంగా ఐఫోనే కొనేయండి, ఆ తేదీ నుంచి యాపిల్ పండగ ఆఫర్లు

Apple Product Offers : ఆండ్రాయిడ్ ఎందుకు దండగ.. ఏకంగా ఐఫోనే కొనేయండి, ఆ తేదీ నుంచి యాపిల్ పండగ ఆఫర్లు
Advertisement

apple product offers : పండగ సీజన్​ వేళ ప్రముఖ ఇ- కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్​ కార్ట్​ ఫెస్టివల్ సీజన్​ సేల్స్​ పేరిట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్​, స్మార్ట్ ఫోన్స్​ పై అదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ ప్రియులకు ఐఫోన్స్​ పై సూపర్ డిస్కౌంట్​లను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు స్వయంగా యాపిల్​ తన సొంత ఫెస్టివల్ సీజన్ ఆఫర్​ సేల్​ ను ప్రారంభించనుంది. పండగ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో యాపిల్‌ ప్రత్యేక సేల్‌ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. యాపిల్ ఫ్యాన్స్​, ఇతర వినియోగదారులను మరింత ఆకర్షించడమే లక్ష్యంగా, వారికి తక్కువ ధరకే ఐఫోన్​ ను అందించేలా ఈ ఫెస్టివల్ ఆఫర్​ ను ప్రకటించింది యాపిల్ కంపెనీ​.

ఈ యాపిల్‌ ఫెస్టివ్‌ సీజన్‌ సేల్‌ లో ఐఫోన్‌, మ్యాక్‌ బుక్‌ సహా పలు ఉత్పత్తులను రాయితీ ధరకు అందించనుంది. ఈ విషయాన్ని టెక్ వర్గాలే స్వయంగా వెల్లడించాయి. అయితే గరిష్ఠంగా ఎన్ని వేల వరకు తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయో మాత్రం ప్రస్తుతానికి తెలుపలేదు. ఇంకా ఈ సేల్​ లో అదనంగా ఎక్స్ఛేంజ్‌ రాయితీలనూ పొందొచ్చు.

Advertisement

ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే? – ఇండియాలో వచ్చే నెల నుంచి ఈ యాపిల్ ఫెస్టివల్ ఆఫర్​ మొదలు కానుంది. ఈ స్పెషల్ సేల్​ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్పెషల్ డీల్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు యాపిల్ ఇండియా ఆన్​లైన్​లో స్టోర్​లో ఉంటాయి.

ఏఏ ప్రొడక్ట్స్​పై ఆఫర్లున్నాయంటే? – ఈ స్పెషల్ సేల్​లో ఐఫోన్​ 15, ఐఫోన్ 16 తో పాటు మ్యాక్ బుక్స్​పై సూపర్ ఆఫర్స్​ను ఇవ్వనుంది యాపిల్. అయితే ప్రస్తుతానికి ఆఫర్ల వివరాలను పక్కాగా ప్రకటించలేదు సదరు సంస్థ. కానీ త్వరలోనే ప్రకటించబోయే ఆ ఆఫర్ల ద్వారా ఉండే సదుపాయాలను తెలిపింది. బ్యాంక్​ ఆఫర్ల ద్వారా, డిస్కౌంట్ల ద్వారా వీటిని పొందవచ్చు.

Advertisement

ALSO READ : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!

ఈ స్పెషల్ సేల్ ద్వారా కలిగే ప్రయోజనాలు – 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్​ఐ సదుపాయంతో ప్రతి నెల ఇన్​స్టాల్​మెంట్​ వారిగా పేమెంట్ చేయొచ్చు.

ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని యాపిల్ ట్రేడ్​ ఇన్​లో ఎక్స్​చేంజ్​ ద్వారా అడిషనల్​ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. అలానే ఇన్​స్టంట్​ క్రెడిట్​ను పొందవచ్చు.

స్పెషల్ సేల్ తో మూడు నెలల వరకు యాపిల్ ఫ్రీ మ్యూజిక్​ను పొందవచ్చు. అయితే సెలక్టడ్​ యాపిల్​ డివైస్​ను కొనుగోలు చేస్తేనే ఇది వర్తిస్తుంది. మిగిలిన వాటికి వర్తించదు.

అలానే ఎయిర్ పాడ్స్​, ఎయిర్ ట్యాగ్​, యాపిల్ పెన్సిల్​ (2వ జనరేషన్), ఐప్యాడ్​పై ఎమోజీస్​, పేర్లు, నెంబర్లను ఫ్రీగా ఎంగ్రేవ్​ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఒకవేళ మీరు యాపిల్ ఫెస్టివల్​ ఆఫర్​ ప్రకటించే వరకు వేచి ఉండలేకపోతే.. ప్రస్తుతం ఆన్​లైన్​లో ఐఫోన్ 15, మ్యాక్ బుక్​ ఎయిర్ ఎమ్​1, ఎమ్​ 2 మోడల్స్ ​పై బ్యాంక్​ ఆఫర్స్ ​తో స్పెషల్ ప్రైస్ ​తో కొనుగోలు చేయవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×