BigTV English

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  అప్పుడెప్పుడో వినాయక చవితికి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఈరోజు ఆ సెకండ్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.


రా మచ్చ మచ్చ రా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ స్పెషాలిటీ గురించి శంకర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ సాంగ్.. రామ్ చరణ్ ఎంట్రీ సాంగ్ అని, ఇందులో 1000 మందికి పైగా జానపద కళాకారులు కనిపిస్తారని తెలిపాడు. అంతేకాకుండా ఈ సాంగ్ లో రామ్ చరణ్ డ్యాన్స్ అద్భుతంగా ఉంటుందని, సింగిల్ టేక్ లో చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సాంగ్ ప్రోమోలో శంకర్ చెప్పినవన్నీ ఉన్నాయి కానీ, ఆయన మార్క్ లేదు అని కనిపిస్తోంది.

చరణ్ ఎంట్రీ సాంగ్ అంటే.. ఇంకెంతో ఊహించుకున్న అభిమానులు.. ప్రోమో చూసే పెదవి విరుస్తున్నారు. చరణ్ స్టెప్స్ బాగానే ఉన్నా.. అంత ఇంపాక్ట్ అనిపించడం లేదు. అంతమంది మధ్య చరణ్ కాస్ట్యూమ్స్ తేలిపోయాయి. బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య స్టెప్స్ స్లోగా ఉన్నా.. చరణ్ ఈజ్ తో మెప్పించిన తీరు ఆకట్టుకుంటుంది.  అయితే ప్రోమో చూసి.. సాంగ్ మొత్తాన్ని అంచనా వేయలేము కాబట్టి.. పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యాకా కానీ.. సాంగ్ పై ఒక నిర్ణయానికి రాలేము అన్నది కొందరి మాట.


జరగండి.. జరగండి సాంగ్ కూడా మొదట ఇలానే పెదవి విరిచారు. ఆ లిరిక్స్ ఏంటి.. ? ఆ మ్యూజిక్ ఏంటి.. ? అని.. కానీ స్లో గా జరగండి సాంగ్ ఆడియెన్స్ ను పిచ్చెక్కించింది. ఎక్కడకు వెళ్లినా.. అదే పాట. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాంగ్స్ లో జరగండి ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆ రేంజ్ లో రా మచ్చ సాంగ్ ఉంటుందా లేదా.. అనేది సెప్టెంబర్ 30 న పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యేవరకు చెప్పలేం. నిజం చెప్పాలంటే.. మొదటి నుంచి ఈ సినిమాపై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే భారతీయుడు 2 ప్లాప్ ఎఫెక్ట్.. గేమ్ ఛేంజర్ పై పడింది. ఇది కాకుండా ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది లేదు. కోట్లు కోట్లు సినిమాకు ఖర్చుపెట్టిస్తున్నాడు కానీ, రిజల్ట్ మాత్రం రావడం లేదు అని శంకర్ పై గుర్రుమంటున్నవారు చాలామందే ఉన్నారు. ఇంకోపక్క ఆర్ఆర్ఆర్  రాజమౌళి సెంటిమెంట్.. చరణ్ కు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్.. దేవర సినిమాతో గుడ్డిలో మెల్లగా తప్పించుకున్నాడు. భారీ హిట్ రాకపోయినా డిజాస్టర్ ను అయితే అందుకోలేదు. మరి ఇప్పుడు చరణ్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేది చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×