Aprilia Tuono 457: భారత మార్కెట్‌లో యువ రైడర్స్ ఎప్పుడూ కొత్త టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆ అంచనాలను నెరవేర్చేలా ఇటలీ బ్రాండ్ అప్రిలియా తాజాగా టువోనో 457ను లాంచ్ చేసింది. ఈ బైక్ రోడ్డు మీద కనిపించగానే అందరి దృష్టిని ఆకర్షించేలా రూపొందించబడింది. దాని ఎగ్జాస్ట్ శబ్దం ఎంతో స్పోర్టీగా ఉండి, రైడర్‌కు ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. రోడ్ ప్రెజెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్ మీద ఎవరైనా వెళ్ళినా అందరి చూపులు తప్పక ఆగిపోతాయి.
డిజైన్- స్పోర్టీ బాడీ షేప్
డిజైన్ పరంగా చూస్తే, బలమైన ఫ్యూయల్ ట్యాంక్, స్పోర్టీ బాడీ షేప్, స్టైలిష్ లైటింగ్ సెట్‌ప్ ఈ బైక్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకొస్తాయి. రైడింగ్ పొజిషన్ కొంచెం అగ్రెసివ్‌గా అనిపించినప్పటికీ, లాంగ్ రైడ్స్‌కి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంజిన్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉండి, గేర్ షిఫ్ట్స్ సాఫ్ట్‌గా మారడం వల్ల ట్రాఫిక్‌లోనూ రైడ్ చేయడం సులభంగా ఉంటుంది. హైవేలో అయితే దీని స్పీడ్, స్టెబిలిటీ మరింత ఆకట్టుకుంటాయి.
గంటకు 210 కిలోమీటర్ల వేగం!
457సిసి లిక్విడ్ కూల్డ్ ప్యారలెల్ ట్విన్ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం కొన్ని సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ చేరడం దీని ప్రత్యేకత. నగర రైడ్స్‌లో సులభమైన కంట్రోల్ ఇవ్వడమే కాకుండా, హైవేపై దూసుకుపోతున్నప్పుడు కూడా అద్భుతమైన గ్రిప్, బ్యాలెన్స్ కల్పించడం ఈ బైక్ ప్రత్యేకత.
భద్రతా- మైలేజ్
భద్రత విషయంలో అప్రిలియా ఎలాంటి రాజీ పడలేదు. డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండటంతో, అధిక వేగంలో కూడా రైడర్‌కి పూర్తిగా నమ్మకాన్ని కలిగిస్తాయి. మైలేజ్ విషయానికొస్తే, కంపెనీ అంచనాల ప్రకారం ఇది లీటరుకు సుమారు 25 నుంచి 28 కిలోమీటర్లు వరకు ఇస్తుందని టాక్. ఈ సెగ్మెంట్‌లో ఇది మంచి మైలేజ్‌గా భావించవచ్చు.
టువోనో 457 భారత మార్కెట్లో ధర
ధర విషయానికి వస్తే, టువోనో 457 భారత మార్కెట్లో సుమారు రూ.4.10 లక్షల నుంచి ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ ధర రేంజ్‌లో ఇది కెటిఎం డ్యూక్ 390, కవాసకి నింజా 400, యమహా ఆర్3 వంటి బైక్‌లకు నేరుగా పోటీగా నిలుస్తోంది. పనితీరు పరంగా కూడా ఇది వెనుకంజ వేయకుండా, హై-ఎండ్ బైక్‌లతో సరితూగేలా తయారైంది. స్పోర్ట్ రైడింగ్‌ని ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చే ఆప్షన్ అవుతుంది. ప్రీమియమ్ బైక్ అనుభవాన్ని కోరుకునే యువ రైడర్స్‌కి ఈ మోడల్ మార్కెట్లో హాట్ టాపిక్ కానుంది.