Jio Anniversary Offer: భారతదేశంలో టెలికాం రంగానికి కొత్త దిశ చూపిన సంస్థ రియల్స్ జియో. తక్కువ ధరలకు ఎక్కవ నాణ్యత కలిగిన సేవలు అందించడం ద్వారా వినియోదారులందరికి దగ్గర అయ్యింది. మొదటిసారి మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి కస్లమర్ల కోసం రిచార్జ్ ఆఫర్లు, డిజిటల్ ఆఫర్లు తీసుకొస్తూ దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఎదిగింది. ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ హోమ్ సర్వీసులు వంటి విభాగాల్లో కూడా విస్తరించింది.
కేవలం రూ.100 రీచార్జ్ చేసుకుంటే 5జిబి డేటా
ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగంగా జియో వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటూ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందేలా ఈ పథకం రూపొందించబడింది. కేవలం రూ.100 రీచార్జ్ చేసుకున్నవారికి ఒక నెలపాటు అదనంగా 5జిబి డేటా ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా 28 రోజులపాటు అపరిమిత 5జి సేవలను ఆస్వాదించవచ్చు. డిజిటల్ వినియోగం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆఫర్ ప్రతి యూజర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది
జియో గోల్డ్ పై రెండు శాతం వరకు ప్రత్యేక తగ్గింపు
కేవలం డేటా మాత్రమే కాకుండా, జియో గోల్డ్ ఫ్రాన్స్‌పై రెండు శాతం వరకు ప్రత్యేక తగ్గింపు కూడా లభిస్తుంది. అదనంగా రెండు నెలలపాటు జియో హోమ్ సర్వీస్‌ను ఉచితంగా ఉపయోగించే అవకాశం కల్పించారు. ఇది ఇంటి అవసరాలకు సరిపోయే కొత్త సొల్యూషన్‌గా జియో పరిచయం చేసిన సర్వీస్.
రీచార్జ్ ఆఫర్‌తో పాటు రూ.3000 వేల విలువైన గిఫ్టులు
ఇవన్నీ మాత్రమే కాకుండా ఈ రీచార్జ్ ఆఫర్‌తో పాటు రూ.3000 వేల విలువైన గిఫ్టులు కూడా అందించబడతాయి. వాటిలో జియో హాట్‌స్టార్, జియోసావ్న్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. అలాగే జొమాటో గోల్డ్, నెట్‌మెడ్స్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌పై ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. అదనంగా అజియో, ఈజ్‌మైట్రిప్, రిలాయంస్ డిజిటల్ వంటి ప్రముఖ సేవలపై డిస్కౌంట్లు అందుతాయి. అంటే ఒక రీచార్జ్‌తో ఇంటర్నెట్ నుంచి షాపింగ్ వరకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి.
మొత్తం మీద జియో వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఈ వార్షికోత్సవ ఆఫర్ నిజంగా విలువైనది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత 5జి, కొత్త సర్వీసులపై ట్రయల్స్, షాపింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్కౌంట్లు అన్నీ ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా లభిస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే రీచార్జ్ చేసి ప్రయోజనాలు పొందడం మంచిది.