secretly read Whatsapp Photos| వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, ఇతర మీడియా లేదా ఏదైనా లింక్స్‌ను చూడాలని పంపినవారికి తెలియకుండా అందరూ భావిస్తారు. కానీ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఇది సాధ్యం కాదని అనుకుంటారు. కానీ సెండర్ కు తెలియకుండా ఫొటోలు, వీడియోలను చూడడం సాధ్యమే. దీనికి మీరు సెట్టింగ్స్‌లో రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. చాట్‌లోని బిల్ట్-ఇన్ ఇన్ఫర్మేషన్ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా ఇది ఈజీగా సాధ్యమవుతుంది. ఈ సులభమైన టెక్నిక్‌తో మీరు ఫోటోలు, లింక్‌లు లేదా డాక్యుమెంట్‌లను రహస్యంగా చూడవచ్చు.
ముందుగా, మీరు చూడాలనుకున్న చాట్‌ను మీ ఫోన్‌లో ఓపెన్ చేయండి. ఆ తర్వాత, చాట్‌లో ఉన్న కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. వెంటనే ‘కాంటాక్ట్ ఇన్ఫో స్క్రీన్’ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ నుండి.. ‘మీడియా, లింక్స్, అండ్ డాక్స్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఈ ఆప్షన్ చాట్‌లోని కంటెంట్ అంతా కేటగిరీగా విభజించి చూపిస్తుంది. మీరు ‘లింక్స్’ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. చాట్‌లో షేర్ చేయబడిన అన్ని లింక్‌లను చూడవచ్చు. ఇక్కడ నుండి లింక్‌ను ఓపెన్ చేసి చదవవచ్చు. ఈ విధంగా చూసినప్పుడు పంపినవారికి మీరు లింక్ చూశారనే విషయం తెలియదు. అంటే రెండు బ్లూ టిక్స్ వారికి కనిపించవు. అదే విధంగా, ఈ సెక్షన్‌లో ఫోటోలు డాక్యుమెంట్‌లను కూడా చూడవచ్చు.
ఈ టెక్నిక్‌ను ఉపయోగించి ఫోటోలను రహస్యంగా చూడాలంటే.. మీ వాట్సాప్‌లో ఆటో-డౌన్‌లోడ్ మీడియా సెట్టింగ్ ఆన్‌లోనే ఉండాలి. ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే, ఫోటోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. దీనివల్ల మీరు వాటిని సీక్రెట్‌గా చూడగలుగుతారు. ఒకవేళ ఆటో-డౌన్‌లోడ్ ఆఫ్‌లో ఉంటే, ఈ టెక్నిక్ పని చేయకపోవచ్చు. మీడియా కూడా డిస్‌ప్లే కాకపోవచ్చు. ఈ సెట్టింగ్‌ను వాట్సాప్‌లోని ‘స్టోరేజ్ అండ్ డేటా’ సెక్షన్‌లో చెక్ చేయవచ్చు.
వాట్సాప్‌లో ‘రీడ్’ స్టేటస్ అనేది మీరు చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే కౌంట్ అవుతుంది. కానీ ‘కాంటాక్ట్ ఇన్ఫో’ సెక్షన్ ఒక ప్రత్యేక వ్యూయర్ లాంటిది, ఇది మీరు షేర్ చేసిన వాటిని చూడటానికి ఒక ప్రైవేట్ ‘గ్యాలరీ’లా పనిచేస్తుంది. ఈ సెక్షన్ ద్వారా మీరు ఏదైనా చూసినప్పుడు, పంపినవారికి మీరు చూశారని తెలియదు. ఇది ఏదైనా మీడియా లేదా లింక్ రహస్యంగా చెక్ చేయడానికి అద్భుతమైన మార్గం.
ఈ టెక్నిక్ గ్రూప్ చాట్స్‌లో కూడా పనిచేస్తుంది. గ్రూప్ ఇన్ఫో సెక్షన్‌లో ‘మీడియా, లింక్స్, అండ్ డాక్స్’ ఆప్షన్‌ను ఉపయోగించి కంటెంట్‌ను చూడవచ్చు.
ఆటో-డౌన్‌లోడ్ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, వై-ఫై లేదా మొబైల్ డేటాపై మీడియా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. కానీ దీని వల్ల డేటా వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి డేటా వినియోగాన్ని జాగ్రత్తగా గమనించండి.
ఈ ఫీచర్ ద్వారా మీరు లింక్‌లను ఓపెన్ చేసినప్పుడు, బ్రౌజర్‌లో లేదా యాప్‌లో సాధారణంగా చూసినట్లే ఓపెన్ అవుతాయి, కానీ చాట్‌లో రీడ్ చేసినట్లు స్టేటస్ నమోదు కాదు.
ఈ సులభమైన టెక్నిక్‌తో, మీరు వాట్సాప్‌లో ఫోటోలు, లింక్‌లు, డాక్యుమెంట్‌లను పంపినవారికి తెలియకుండా సీక్రెట్‌గా చూడవచ్చు. ఇది మీ ప్రైవసీని కాపాడుతూ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?