Mobile Stolen Block : స్మార్ట్ ఫోన్.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన గ్యాడ్జెట్. ఈ రోజుల్లో ఒక్క నిమిషం కూడా ఈ మొబైల్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మెసేజ్లు, ఫోటోలు, విజ్ఞానం, వినోదం నుంచి డబ్బులు పంపటం వరకూ ప్రతీ ఒక్క విషయం స్మార్ట్ ఫోన్ పైన ఆధారపడి ఉంది. మరి ఇంతటి విలువైన స్మార్ట్ ఫోన్ చోరీ అయితే ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. చాలాసార్లు ఫోన్ పోయిందంటే అశలు వదులుకోవాల్సిన పరిస్థితే అనిపిస్తుంది. అయితే ఇక పై అలాంటి అవసరం ఉండదు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. పోయిన ఫోన్ ను వెతికి పట్టుకోవడమే ఈ పోర్టల్ పని.
ఫోన్ పోతే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ బ్లాక్ చేయడం, మళ్ళీ తిరిగి దొరికాక అన్ బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం మీ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు చేసినప్పుడు ఇచ్చిన ఫామ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫోన్ దొరికిన అనంతరం ఈ ఫామ్ తోనే అన్బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు చేసిన అనంతరం సెల్‌ఫోన్ స్టోర్‌కు వెళ్లి అదే నెంబర్ పై కొత్త సిమ్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాత సిమ్ బ్లాక్ అయిపోతుంది. సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ (Block Stolen/Lost Mobile) ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పటి వరకూ ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఐఎంఈఐ (IMEI) నంబర్లతో పాటు అక్కడ అడిగిన వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. అనంతరం ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వ్యక్తిగత గుర్తింపుకార్డు, ఫోన్ కొనుగోలు రశీదును కూడా ఆ పోర్టల్ లో అప్‌లోడ్ చేయాలి.
ఈ ప్రాసెస్ అయిపోయాక ముందు తీసుకున్న కొత్త సిమ్‌కు రిక్వెస్ట్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా కేసు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. దీంతో ఫోన్ పనిచేయకుండా ఉంటుంది. ఇక వాళ్లు వేరే సిమ్ వేసినా ఫోన్ పనిచేయదు.
ఫోను దొంగలించిన వాళ్ళు సాధారణంగా అందులో కొత్త సిమ్ వేసి వాడటం చేస్తూ ఉంటారు. అయితే ఇలా బ్లాక్ చేసిన మొబైల్ ఫోన్ లో ఎవరైనా కొత్త సిమ్ వేస్తే వెంటనే సిఈఆర్ కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. పోలీసులతో పాటు ఫోన్ లో కొత్త సిమ్ వేసిన వారికి సైతం మెసేజ్ రావటంతో వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారు. ఫోన్ ఏ ప్రాంతంలో ఉందో తేలికగా గుర్తించగలుగుతారు. వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేసి ఈ విషయం వినిపిస్తారు. ఇక దొంగలించిన ఫోన్ ఎవరైనా కొంటే ప్రమాదంలో ఉన్నారని హెచ్చరిస్తారు. దీంతో ఆ వ్యక్తులు వెంటనే అసలు విషయం చెప్పేస్తారు.
ఇక పోయిన ఫోన్ దొరికిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో అన్ బ్లాక్ ఫౌండ్ మొబైల్ ను క్లిక్ చేయాలి. ఇందుకోసం రిక్వెస్ట్ ఐడీ ఆప్షన్ ఎంచుకొని రిక్వెస్ట్ పంపాలి. ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఈ ఫోన్ ను మళ్ళీ మునుపాటిలాగే తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది
ALSO READ : గేమింగ్ ఫోన్స్ పై సగానికి పైగా తగ్గింపు.. రూ.20వేలలోపే ఎన్ని మెుబైల్సో!