Game Changer Movie : మెగా అభిమానులు అందరూ వెయి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇండస్ట్రీలో అన్ని రికార్డులు తిరగరాసే మూవీ ఇదని, ప్రత్యర్థులకు, ఇతర హీరోల ఫ్యాన్స్‌కు, యాంటీ మెగా ఫ్యాన్స్‌కు, ట్రోలర్స్‌కు ఇలా చాలా మందికి సమాధానం చెప్పే సినిమానే ఈ గేమ్ ఛేంజర్ అని మెగా అభిమానులు నమ్ముతున్నారు. కోలీవుడ్‌లో ఎన్నో హిట్స్ ఇచ్చిన శంకర్ ఈ మూవీకి డైరెక్టర్ కాబట్టి.. అవన్నీ నిజమయ్యే రోజు రానే వచ్చిందని అనుకుంటున్నారు. కానీ, ఏదో చిన్న అనుమానం. దీనికి కారణం ఇటీవల వచ్చిన ఇండియన్ 2 మూవీ. ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో గేమ్ ఛేంజర్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇంత టెన్షన్‌లో ఉన్న టైంలో గేమ్ ఛేంజర్ మూవీ టాక్ బయటికి వచ్చింది. ఎలా ఉందో ఇప్పుడు చూద్ధాం…
ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. ఆ ముగ్గురు హీరోలు… రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్, పుష్ప తర్వాత నుంచే ఈ వార్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి దేవర వచ్చింది. యావరేజ్ టాక్ అంటూనే 500 కోట్ల వరకు కలెక్షన్లు తెచ్చుకుంది ఈ మూవీ.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఇప్పటికే బిజినెస్‌తో 1000 కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను క్రాస్ చేసేలా గేమ్ ఛేంజర్ ఉండాలని రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు అనుకుంటున్నారు. అవన్నీ జరుగుతాయా లేదా అంటే… రాబోయే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయడం తప్పా.. చేసేదేమీ లేదు.
అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీని మూవీ టీం రీసెంట్‌గా చూసిందంట. శంకర్‌కి ఎలాంటి కం బ్యాక్ కావాలో అలానే మూవీ ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఇంతగా వెయిట్ చేసిన దానికి అసలైన ఫలితం దక్కిందట. రామ్ చరణ్‌ను మరోసారి గ్లోబల్ రేంజ్‌కి తీసుకువెళ్లే సినిమా అని టాక్ వస్తుంది.
సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు సెకండాఫ్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని తెలుస్తుంది. సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న ఓల్డ్ పాత్రతో వస్తున్న ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ 45 నిమిషాల పాటు ఆడియన్స్ కళ్లు తిప్పుకోకుండా చేస్తుందట. సీనియర్ రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ ఫర్మామెన్స్ కానీ, ఆ టైంలో వచ్చే సీన్స్ కానీ, ఆడియన్స్ తప్పకుండా ఇంప్రెస్ చేసేలా ఉంటాయట.
మార్పు కోసం చేసే రివేంజ్ కథతో శంకర్ అద్భుతమైన స్క్రిన్ ప్లేతో రెడీ చేశాడని తెలుస్తుంది. రీసెంట్‌గా వచ్చిన దేవరతో పాటు రాబోయే పుష్ప2 మూవీస్ కంటే, గేమ్ ఛేంజర్ మూవీనే బాగుందనే టాక్ బయటికి వస్తుంది.
ఈ సారి సంక్రాంతి విన్నర్ గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణే నిలుస్తాడనే కాన్ఫిడెంట్ మూవీ చూసిన టీంకు వచ్చిందట. ఈ టాక్ బయటికి రావడంతో మెగా అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది అంటూ ఖుషి అవుతున్నారు.
కాగా, గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి మొదటి వారంలో ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ రాబోతున్నారు అని టాక్.