Blue Ghost: గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు తాజాగా విజయవంతమయ్యాయి. ఈ క్రమంలోనే చంద్రుని ఉపరితలంపై బ్లూ గోస్ట్ మొదటిసారిగా అడుగు పెట్టి రికార్డ్ సృష్టించింది. ఈ ల్యాండింగ్ చంద్రునిలో కీలక భాగమైన మారే క్రిసియం పరిధిలోని మోన్స్ లాట్రెయిల్ ప్రాంతంలో జరిగింది. ఈ మిషన్ జనవరి 15, 2025న ప్రారంభించారు. ఆ క్రమంలో SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
నాసా సహకారం ద్వారా ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్ సమయంలో అంతరిక్ష నౌక దాదాపు ఒక నెల పాటు భూమి చుట్టూ తిరుగుతూ, 16 రోజులు చంద్రుని కక్ష్యలో ఉన్న తర్వాత ఆదివారం చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగింది. ఈ విజయంతో ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ చంద్రుని ఉపరితలంపై దిగిన మొదటి ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. దీంతో అమెరికాలోని ఒక ప్రైవేట్ కంపెనీ తొలిసారిగా బ్లూ గోస్ట్‌ను అంతరిక్షంలోకి పంపించి అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.
We’re baaack! 🌕
Blue Ghost has landed, safely delivering 10 NASA scientific investigations and tech demos that will help us learn more about the lunar environment and support future astronauts on the Moon and Mars. pic.twitter.com/guugFdsXY3
— NASA (@NASA) March 2, 2025
ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ ‘బ్లూ గోస్ట్’ ల్యాండర్ స్వయంగా చంద్రుని కక్ష్యలోకి దిగింది. దీని పొడవు రెండు మీటర్లు. మరికొన్ని రోజుల్లో చంద్రుని ఈశాన్య వైపున ఉన్న ఇంపాక్ట్ బేసిన్‌లో ఉన్న పురాతన పర్వత ప్రాంతానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ల్యాండర్ పడిపోకుండా స్థిరంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టెక్సాస్‌కు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ అనే సంస్థ ఈ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసింది. బ్లూ ఘోస్ట్ తోపాటు జపాన్ కు చెందిన మరో ల్యాండర్ హకుటో ఆర్2ను కూడా నింగిలోకి పంపంచినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ క్రమంలో ఫైర్‌ఫ్లై అనే స్టార్టప్ చంద్రునిపై అంతరిక్ష నౌకను దింపిన మొదటి ప్రైవేట్ సంస్థగా నిలిచింది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా, భారతదేశం, జపాన్ వంటి ఐదు దేశాలు మాత్రమే ఇలాంటి విజయాన్ని సాధించాయి. అంతేకాదు మరో రెండు కంపెనీల ల్యాండర్లు కూడా చంద్రునిపై దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Read Also: Samsung: క్రేజీ ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్స్..
బ్లూ గోస్ట్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత చంద్రునిపై నుంచి ఓ చిత్రాన్ని పంపించింది. ఆ చిత్రంలో చంద్రుని ఉపరితలంతోపాటు భూమి దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంతోపాటు ల్యాండర్ పరికరాలతోపాటు మొత్తం చీకటి ప్రాంతం ఉన్నట్లుగా ఉంది. ఉపరితలం కూడా ఈ చిత్రంలో స్పష్టంగా కనిపించడం లేదు.
Just in, our #GhostRiders downlinked another incredible Moon shot following a successful touchdown! Image shows the Moon's surface and Earth on the horizon. Blue Ghost's solar panel, X-band antenna (left), and LEXI payload (right) are also in view. #BGM1 pic.twitter.com/UIMB0ON3k3
— Firefly Aerospace (@Firefly_Space) March 2, 2025
ఈ మిషన్ సక్సెస్ పట్ల ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ CEO జాసన్ కిమ్ స్పందించారు. ఫైర్‌ఫ్లైని చంద్రమండలంపై విజయవంతంగా డెలివరీ చేసినందుకు నాసాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో అంతరిక్ష పరిశోధనకు మరింత అవకాశం ఉందన్నారు. అంతేకాదు చంద్రుడు, అంగారక గ్రహం భవిష్యత్ మిషన్లపై ప్రభావాన్ని చూపే మరిన్ని కీలక ప్రయోగాలను అన్ లాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.