T20 World Cup 2026: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు (T20 World Cup 2026 ) సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన వేదికలు అలాగే తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ముందుగా అందరూ ఊహించినట్లుగానే నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium) ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరుగునుంది. అటు సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026 schedule) సంబంధించిన వేదికలు దాదాపు ఖరారు అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నగరాలను ఎంపిక చేశారట. ఈ లిస్టులో హైదరాబాద్ లేదా విశాఖపట్నం ఎక్కడ కనిపించలేదు. కేవలం నాలుగు నగరాలను మాత్రమే సెలెక్ట్ చేశారు. సౌత్ ఇండియా నుంచి హైదరాబాద్ ( Hyderabad) అలాగే విశాఖపట్నం సెలెక్ట్ కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కచ్చితంగా హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ అయిన నిర్వహించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మొట్ట మొదటి మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium) జరగనుండగా ఫైనల్ మ్యాచ్ మోడీ స్టేడియంలోనే నిర్వహిస్తారు. సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. ఇక ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానుంది అంటున్నారు. మార్చి 8వ తేదీన ఫైనల్ నిర్వహిస్తారని సమాచారం.
ICC టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఈ సారి 20 జట్లు పాల్గొంటాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేయబోతున్నారు. ఒక గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఎప్పటిలాగే టీమిండియా అలాగే పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉండనున్నాయి. గ్రూప్ ఏ లో టీమిండియా, పాకిస్తాన్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఇటలీ ఉంటాయని సమాచారం అందుతోంది. అంటే ఈ లెక్కన గ్రూప్ స్టేజిలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇండియాతో పాటు శ్రీలంక కూడా టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. అయితే, ఈ టోర్నమెంట్ లో ఫైనల్ కు పాకిస్తాన్ ( Pakisthan) వెళితే, పరిస్థితి వేరేలాగా ఉంటుంది. శ్రీలంకలోని కొలోంబో వేదికగా పాకిస్తాన్ ఫైనల్ ఆడనుంది.
🚨 T20I WORLD CUP UPDATES 🚨 [Devendra Pandey From Express Sports]
– First match at Narendra Modi Stadium.
– Final at Narendra Modi Stadium.
– Semi Final at Wankhede Stadium.
– Tournament is likely to start on February 7th & final on March 8th. pic.twitter.com/ELUo3ZDLiB— Johns. (@CricCrazyJohns) November 9, 2025
ICC Men's T20 World Cup 2026 – Groups#T20worldcup2026 pic.twitter.com/cI66ANyvdx
— 𝗔𝘀𝗶𝗺 𝗡𝗮𝘃𝗲𝗲𝗱 🦋 (@realAsim_naveed) November 9, 2025