Gujarat ATS: అహ్మదాబాద్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అరెస్టు చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. వారిలో ఒకడైన సయ్యద్ అహ్మద్‌ను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అదుపులోకి తీసుకొని గుజరాత్‌కు తరలించారు. అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులు గత ఏడాది నుండి ఏటీఎస్ నిఘాలో ఉన్నారు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు ఏటీఎస్ పోలీసులు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ వెల్లడించింది. వారి ఉగ్ర కుట్రలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తును ముమ్మరం చేసింది.