OTT Movie : థ్రిల్లర్ అభిమానులను కొన్ని సినిమాలు ఓటీటీలో బాగా భయపెడుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా లైట్స్ ఆఫ్ చేసి, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమాలు ఇవి. ఒక్క సీన్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్లైమాక్స్ మైండ్ ని పూర్తిగా షేక్ చేస్తుంది. ‘బర్డ్ బాక్స్’లో కళ్లు తెరిచి చూస్తే సూసైడ్, ’10 క్లోవర్‌ఫీల్డ్ లేన్’లో బంకర్ టెన్షన్, ‘ది ఆక్యుపంట్’లో ఇల్లు దొంగతనం, ‘సాల్ట్ బర్న్’లో రిచ్ ఫ్యామిలీ ఆబ్సెషన్ తో ఈ సినిమాలను ఒక్క సారి చూస్తే ఎప్పటికీ మరచిపోలేరు. అన్నీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. ఇవి చూస్తే రాత్రి నిద్ర పట్టడం కూడా కష్టమే. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన లిస్ట్ ఇదే.
సాండ్రా బుల్లాక్ ఇందులో హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించింది. ఈ కథలో భారీ విపత్తు వల్ల ప్రపంచం చివరి దశలో ఉంటుంది. ఒక మిస్టీరియస్ శక్తి వల్ల, కళ్లు తెరిచి చూస్తే మనుషులు సూసైడ్ చేసుకుంటూ చనిపోతుంటారు. మలోరీ తన ఇద్దరు పిల్లల్ని కళ్ళకి గంతలు కట్టి, సేఫ్ ప్లేస్ వెతుకుతుంది. ఉత్కంఠంగా సాగే ఈ కథ క్లైమాక్స్ మరింత ఇంటెన్స్ గా ఉంటుంది. ఒక్క సౌండ్ ఎఫెక్ట్స్ కే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 2018లో వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్, ఐయండిబిలో 6.6/10 రేటింగ్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మేరీ ఎలిజబెత్ విన్‌స్టెడ్, జాన్ గుడ్‌మన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016లో వచ్చింది. ఈ కథ ఒక కారు అక్సిడెంట్ తర్వాత మొదలవుతుంది. ఇందులో మిచెల్ అనే అమ్మాయి, అక్సిడెంట్ తర్వాత ఒక బంకర్‌లో మేలుకుంటుంది. హోవార్డ్ అనే వ్యక్తి బయట ఏలియన్ అటాక్ జరుగుతోందని, ఆమెను బయటకి వెళ్ళనీకుండా చేస్తాడు. హోవార్డ్ నిజం చెప్తున్నాడా లేక సైకో కిడ్నాపరా అని డౌట్ ఆమెకు వస్తుంది. ఆ తరువాత బంకర్ లో టెన్షన్ పీక్ కి వెళ్తుంది. క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో కేక పెట్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
జాబ్ పోయి లగ్జరీ అపార్ట్‌మెంట్ అమ్మేసిన జావియర్ అనే వ్యక్తి తన పాత ఇంటి మీద ఆబ్సెషన్ పడతాడు. కొత్త ఫ్యామిలీని స్టాక్ చేసి, వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. మానిప్యులేషన్ లెవెల్ పీక్ లో ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం మిస్ కావద్దు. 2020లో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జెలసీ ఎంత డేంజర్ గా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది.
2023లో వచ్చిన ఈ సినిమాలో బారీ కీఘన్, జేకబ్ ఎలార్డి లీడ్ రోల్స్ లో నటించారు. ఆలివర్ అనే ఒక పేద కుర్రాడు, ఫెలిక్స్ అనే రిచ్ అబ్బాయితో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఆ ఇంటి (సాల్ట్‌బర్న్ ఎస్టేట్)కి సమ్మర్ లో వెళ్తాడు. రిచ్ ఫ్యామిలీ మీద ఆబ్సెషన్ పెరిగి ఒక్కొక్కరిని దారుణంగా చంపడం మొదలు పెడతాడు. ఈ సినిమా రిచ్ vs పూర్ అన్నట్లు ఉంటుంది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా 7.0/10 రేటింగ్ తో నడుస్తోంది. ఈ సినిమాలలో వచ్చే ఒక్కో సీన్ టెన్షన్ ని పీక్ కి తీసుకెళ్తుంది. క్లైమాక్స్ ట్విస్టులకు మతి పోవడం ఖాయం.
Read Also : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ