Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, హెలిప్యాడ్‌కు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పవన్‌ను చూసేందుకు స్థానికులు, అభిమానులు ఒక్కసారిగా ఆయన కాన్వాయ్ ముందుకు దూసుకురావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఓ మహిళ కిందపడిపోగా, ఆమె కాలిపై నుంచి కాన్వాయ్‌లోని ఓ వాహనం వెళ్లింది. గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను పక్కకులాగి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగలో 20 ఎకరాల్లో దీని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులు తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా ఎనుగుల విన్యాసాలను వీక్షించారు. ఎనుగులను చూసి ఆనందం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, అడవుల సంరక్షణలో కుంకీ ఎనుగుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
మహిళ కాలుపై నుంచి వెళ్లిన పవన్ కాన్వాయ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం… pic.twitter.com/SZhnMP1xgU
— ChotaNews App (@ChotaNewsApp) November 9, 2025