BigTV English

Samsung: క్రేజీ ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్స్..

Samsung: క్రేజీ ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి మూడు కొత్త స్మార్ట్ ఫోన్స్..

Samsung: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ పోన్ల తయారీ సంస్థ శాంసంగ్ మార్కెట్లో పోటీని ఎదుర్కొనేందుకు కొత్త కొత్త అప్ డేట్స్ అనౌన్స్ చేస్తుంది. జనవరి 2025లో Samsung తన Galaxy S25 5 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో మరో కీలక సిరీస్ ప్రవేశపెట్టింది. అదే Samsung Galaxy A ఎట్టకేలకు లాంచ్ అయింది.ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ Samsung Galaxy A56, Galaxy A36, Galaxy A26 స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఏఐ ఫీచర్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ గురించి ఇప్పటికే చాలా లీక్‌లు వచ్చాయి. టెక్ దిగ్గజం ఈ సిరీస్‌ను MWC 2025 సందర్భంగా భారత మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో మీరు మంచి ఫీచర్స్ ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ మోడల్ ఫోన్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ పోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత ఉందనే అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ A ధర

2025 MWC సందర్భంగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల ఇండియన్ ధరలను శాంసంగ్ ప్రకటించింది. ప్రపంచ మార్కెట్లో Samsung Galaxy A56 5G ధర USD 499.99గా ఉండగా, ఇండియాలో రూ. 43,735గా ప్రకటించారు. అదే సమయంలో Samsung Galaxy A36 5G రేటు USD 399.99, అంటే దాదాపు రూ. 34,990కి ఇండియాలో లాంచ్ అవుతుంది. Samsung Galaxy A26 5G గురించి మాట్లాడుకుంటే, ఇది USD 299.99కి అంటే దాదాపు రూ. 26,240కి లాంచ్ కానుంది.


Samsung Galaxy A56 ఫీచర్స్

Samsung Galaxy A56.. 6.7 అంగుళాల ఫుల్ HD ప్లస్, సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్ ఎక్సినోస్ 1580 4nm టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB RAM, 256GB స్టోరేట్ సపోర్ట్ ఉంది. ఇది ట్రిపుల్ కెమెరాను కలిగి ఉండగా, దీనిలో 50+12+5 మెగాపిక్సెల్ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ కూడా ఉంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉండగా, ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Read Also: Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

Samsung Galaxy A36 స్పెసిఫికేషన్లు

కంపెనీ IP67 రేటింగ్‌తో Samsung Galaxy A36ని విడుదల చేసింది. దీనిలో 6.7 అంగుళాల సూపర్ రెటినా డిస్ ప్లే వస్తుండగా, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7+ రక్షణ ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. దీనిలో 8GB RAM, 256GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌, 50 + 8 + 5 మెగా పిక్సెల్ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉండగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసింది.

Samsung Galaxy A36 స్పెసిఫికేషన్లు

కంపెనీ IP67 రేటింగ్‌తో Samsung Galaxy A36ని విడుదల చేసింది. దీనిలో 6.7 అంగుళాల సూపర్ రెటినా డిస్ ప్లే వస్తుండగా, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7+ రక్షణ ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. దీనిలో 8GB RAM, 256GB స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌, 50 + 8 + 5 మెగా పిక్సెల్ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉండగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసింది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×