Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. తనకు అనుకూలంగా లేని దేశాలపై భారీగా టారిఫ్ లు విధిస్తున్నారు. టారిఫ్ లతో యుద్ధాలు ఆపుతున్నాయని చెబుతున్న ట్రంప్.. తాజాగా మరోసారి తన టారిఫ్ లో విధానంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టారిఫ్ విధించడంపై తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకించేవారిని “మూర్ఖులు” అని ఘాటుగా స్పందించారు. సుంకాలు అమెరికాను మరింత బలంగా, సంపన్నంగా మార్చాయని పేర్కొన్నారు.
“సుంకాలను వ్యతిరేకించే వాళ్లు మూర్ఖులు” అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ రాసుకొచ్చారు. తన నాయకత్వంలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యంత ప్రభావవంతమైన దేశంగా మారిందన్నారు. దాదాపు ద్రవ్యోల్బణం లేకుండా రికార్డు స్టాక్ మార్కెట్ ధరతో వృద్ధి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల నుంచి అమెరికాకు ట్రిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చిందన్నారు. సుంకాల నుంచి వచ్చిన ఆదాయంతో అమెరికా 37 ట్రిలియన్ డాలర్ల రుణాలు తీర్చడానికి సహాయపడిందని అన్నారు.
అమెరికాలో అన్ని చోట్ల ప్లాంట్లు, కర్మాగారాలు పెరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి కనీసం 2,000 డాలర్ల డివిడెండ్ అందుతుందన్నారు. దీనిపై అధికారిక ఉత్తర్వులను ఇంకా ప్రకటించలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు 2,000 డాలర్ల టారిఫ్ ప్రకటించారు. అమెరికా టారిఫ్ ఆదాయాల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ట్రిలియన్ డాలర్లు అమెరికాకు టారిఫ్‌ల రూపంలో అందుతున్నాయి. ఈ ఆదాయాన్ని అధిక సంపాదన ఉన్న వారిని మినహాయించి దేశ రుణాన్ని తగ్గించడానికి, పౌరులకు డివిడెంట్ ఇవ్వడానికి ఉపయోగిస్తామని అన్నారు. టారిఫ్ లో వలన రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు 401(k) విలువలను చేరుకున్నాయన్నారు.