BigTV English

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Money Making With Canva: డిజిటల్ రంగంలో కాన్వా(Canva) ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డిజైన్ సాఫ్ట్‌ వేర్ ను ఉపయోగించి, వేగంగా, సులభంగా, క్రియేటివ్ గా గ్రాఫిక్ డిజైన్లు చేసుకునే అవకాశం ఉంది. మనసుకు నచ్చేలా అద్భుతమైన డిజైన్ టెంప్లేట్లను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కాన్వా సాయంతో రూపొందించిన డిజైన్లను అమ్ముకుంటూ కాసులు వెనుకేసుకోవచ్చు. ఇంతకీ కాన్వా ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చూద్దాం..


ఫ్రీలాన్సింగ్ డిజైన్ సర్వీసులు

కాన్వా సాయంతో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేయవచ్చు. కస్టమర్లకు ఫ్లయర్స్, పోస్టర్స్, బ్రోచర్స్,  సోషల్ మీడియా గ్రాఫిక్స్ రూపొందించి డబ్బు సంపాదించుకోవచ్చు.


డిజైన్ టెంప్లేట్ల తయారీ  

కావ్వా సాయంతో  రూపొందించిన స్పెషల్ డిజైన్ టెంప్లేట్లను పలు ఆన్ లైన్ వేదికల ద్వారా అమ్ముకునే అవకాశం ఉంది.  అంతేకాదు, సొంతంగా వెబ్ సైట్ లేదంటే, బ్లాగ్ పెట్టి అక్కడ కాన్వా డిజైన్ టెంప్లేట్లను అమ్ముకోవచ్చు.

ఇ-బుక్స్, బుక్స్   

కాన్వాలో డిజైన్ చేసి అందమైన ఇ-బుక్ కవర్లు, ఇన్‌ హ్యాండ్లను రూపొందించవచ్చు. ఇ-బుక్స్ ను అమెజాన్ కిండ్ల్ డైరెక్ట్ పబ్లిషింగ్ (KDP) లాంటి ప్లాట్‌ ఫామ్ లో పబ్లిష్ చేసి సేల్ చేసుకోవచ్చు. బుక్ కవర్లు, ఇంటర్నల్ డిజైన్లు రూపొందించి పుస్తక రచయితలు అమ్మవచ్చు.

కోర్సులు, ట్రైనింగ్

కాన్వా సాయంతో ఆన్ లైన్ కోర్సులను రూపొందించవచ్చు. కాన్వా క్లాసులను చెప్పవచ్చు. కాన్వాకు సంబంధించి వివరాలతో ఆన్ లైన్ కోర్సులు రూపొందించి పలు ఫ్లాట ఫామ్ లలో అమ్ముకోవచ్చు. యూట్యూబ్ ద్వారా కాన్వా ఉపయోగించి ట్యుటోరియల్స్ అందించవచ్చు. యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందవచ్చు.

సోషల్ మీడియా మేనేజ్‌మెంట్

కాన్వా ఉపయోగించి క్లయింట్లకు ఆకట్టుకునే సోషల్ మీడియా పోస్టులు,  గ్రాఫిక్స్ రూపొందించవచ్చు. సోషల్ మీడియా మేనేజర్‌ గా పని చేసి డబ్బు పొందవచ్చు.

క్రియేటివ్ ప్రాజెక్టులు

చిన్న వ్యాపారాల కోసం బ్రాండ్ ఐడెంటిటీ, లోగోలు, బ్రోచర్స్ ను కాన్వాదారా రూపొందించవచ్చు.వాటిని ఆయా కంపెనీలకు అందించి ఆదాయం పొందవచ్చు. కాన్వాలో చక్కగా డిజైన్ చేసి, కాఫీ కప్పులు, టిషర్టులు, పోస్టర్లపై ప్రింట్ చేసి అమ్ముకోవచ్చు. అంతేకాదు, Printful, Redbubble లాంటి ప్లాట్‌ ఫామ్ లలో తమ వస్తువులను వినియోగదారులకు అందుబాటులో ఉంచవచ్చు.

 బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్  

కాన్వాను ఉపయోగించి, క్వాలిటీ విజువల్ కంటెంట్, ఇన్ఫోగ్రాఫిక్స్ సృష్టించవచ్చు. వాటిని  బ్లాగ్ లేదంటే  సైట్‌ లో పెట్టుకోవచ్చు. డిజైన్ క్రియేషన్, కాన్వా కంటెంట్ మీద ఆదాయం పొందవచ్చు.

మొత్తంగా కాన్వా డిజైన్ సాఫ్ట్ వేర్ సాయంతో అద్భుతమైన కంటెంట్ ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా డిజైన్ స్కిల్స్, క్రియేటివిటీ, మార్కెటింగ్ క్యాపబులిటీస్ ఉపయోగించి డబ్బును సంపాదించుకోవచ్చు.

Related News

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Blind Man AI Glasses: ఏఐ గ్లాసెస్‌తో కంటి చూపు లేని వ్యక్తికి ఉద్యోగం.. అదెలాగంటే?

iPhone Price Drops: ఐఫోన్ 15 ధర తగ్గిందోచ్.. మళ్ళీ ఈ ఆఫర్ ఉండదేమో..?

Shock to Airtel Customers: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. ఆప్లాన్ తొలగింపు

Redmi Note 15 Pro+: రెడ్‌మీ నోట్ 15 ప్రో సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీ, 90W చార్జింగ్ లాంటి సూపర్ ఫీచర్లు

Big Stories

×