 
					Manchu Lakshmi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలలో మంచు కుటుంబం ఒకటి. మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలో విలన్ గా హీరోగా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి లక్ష్మీ ప్రసన్న(Lakshmi Prasanna) విష్ణు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం ఈ ముగ్గురు ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. ఇటీవల మంచు కుటుంబం నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇకపోతే మంచు కుటుంబం సినిమాల కంటే కూడా నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల కాలంలో విష్ణు, మనోజ్ మధ్య గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గొడవలు తార స్థాయికి చేరడమే కాకుండా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం రోడ్లపై నుంచి కొట్టుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలా గొడవ కారణంగా మంచు కుటుంబం తరచూ వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కుటుంబం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో కొంతమంది తమ కుటుంబం విడిపోవాలని భావిస్తున్నారంటూ ఈమె మాట్లాడారు.
ఇటీవల మంచు మనోజ్ నటించిన మిరాయ్(Mirai) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా కట్ చేస్తూ కేవలం మనోజ్ కు మద్దతుగా విష్ణును తిడుతున్నట్టు వీడియోలను వైరల్ చేశారు. ఈ వీడియోలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. ఇలా నా మాటలను కట్ చేసి వీడియోలను వైరల్ చేస్తూ కొంత మంది మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఇలా మా కుటుంబం విడిపోవాలని కోరుకున్న వారందరూ సర్వనాశనం అవుతారంటూ శాపనార్థాలు పెట్టారు..
కర్మ అనుభవిస్తారు..
ప్రతి ఒక్క కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి అయితే కుటుంబాన్ని కలపాలనుకుంటారు కానీ ఇలా విడిపోవాలని అనుకోరు . మా కుటుంబం విడిపోవాలి అనుకున్న వారు ఈ జన్మలోనే కర్మ అనుభవిస్తారు అంటూ మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి మంచి లక్ష్మి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు లక్ష్మి ఇటీవల దక్ష అనే సినిమా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్ లో పెద్దగా మెప్పించ లేకపోయిన డిజిటల్ మీడియాలో మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక విష్ణు కన్నప్ప సినిమాతో హిట్ కొట్టగా మనోజ్ మిరాయ్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు.
Also Read: Ram pothineni: డెబ్యూ డైరెక్టర్ తో రామ్ పోతినేని.. జనవరి నుంచి షూటింగ్ మొదలు!