 
					UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో కన్న కొడుకును చంపిన దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి.. కొడుకు పేరున ఉన్న ఒక కోటి రూపాయలకు పైగా బీమా సొమ్మును దోచుకోవడానికి ఒక తల్లి ఈ దారుణమైన కుట్ర పన్నింది. సొంత కొడుకు అని కూడా చూడకుండా చంపేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అంగద్‌పూర్ నివాసి మమతా సింగ్.. తన 25 ఏళ్ల కుమారుడు ప్రదీప్ సింగ్‌ను లవర్ తో కలిసి హత్య చేసింది. ప్రియుడు మయాంక్ కతియార్, అతని సోదరుడు రిషి సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రిత మమతా సింగ్ భర్త మృతచెందాడు. భర్త మరణం తర్వాత మమత.. మయాంక్‌కు దగ్గరైంది. ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే.. ప్రదీప్ ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో.. మమత అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
మమత తన కొడుకు పేరు మీద నాలుగు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ ₹1 కోటి కంటే ఎక్కువ ఉంది. బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకోవడానికి ఆమె ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజు మమత, ఆమె ప్రియుడు ప్రదీప్‌ను ఇంటికి పిలిచారు. తిరిగి వెళ్తున్న సమయంలో మయాంక్, రిషి అతన్ని సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని హైవే సమీపంలో పడవేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో ఎముకల పగుళ్లు, తీవ్రమైన తల గాయాలు బయటపడటంతో అది హత్యగా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.
ALSO READ: Big TV Kissik talks: సూసైడ్ చేసుకోవాలనుకున్న విష్ణు ప్రియ.. బయట పెట్టిన నిజం!
మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా.. నేరం జరిగిన సమయంలో మమత, ఆమె ప్రియుడు ఒకే చోట ఉన్నారని పోలీసులు గుర్తించారు. విచారణలో.. మయాంక్ నేరాన్ని అంగీకరించి, బీమా డబ్బులు వచ్చిన తర్వాత మమత వాటా ఇస్తానని హామీ ఇచ్చిందని వెల్లడించాడు. మయాంక్‌ను పోలీసులు అరెస్టు చేయగా, రిషి కతియార్ ఎన్‌కౌంటర్‌లో పట్టుబడి బుల్లెట్ గాయాలతో చిక్కాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, నాటు తుపాకీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ప్రధాన నిందితురాలు మమతా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.