 
					Menstrual cramps: ప్రస్తుత ఈ ఆధునిక యుగంలో కొత్త టెక్నాలజీలతో ఎన్నో మార్పులు జరుగుతున్నా.. మహిళల నెలసరి నొప్పిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మహిళలు పీరియడ్స్ టైంలో పొత్తికడుపు, నడుము నొప్పి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ పెయిన్ వారి రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. స్త్రీలకు ఇంటిని చక్కబెట్టడం దగ్గరి నుంచి ఆఫీస్ టాస్కులు పూర్తిచేయడం వరకు ప్రతీది పోరాటమే మరి. అలాంటి వారి కోసమే మార్కెట్‌లోకి వచ్చేసింది ఈ ‘పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ డివైజ్’.
ఈ ఆధునిక డివైజ్‌ను ఇంట్లోనే సులువుగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్‌ను నడుము భాగంలో సౌకర్యవంతంగా ధరించవచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా రెండు ప్యాచ్‌లు జతచేసి ఉంటాయి. ఈ ప్యాచ్‌లను పొత్తికడుపు మీద నొప్పి ఉన్న ప్రదేశంలో స్టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత డివైజ్‌కు ఉన్న పవర్ బటన్‌ను నొక్కడం వల్ల ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ డివైజ్ నుంచి వెలువడే సున్నితమైన వేడి వల్ల పీరియడ్స్ పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఈ పెయిన్ రిలీఫ్ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. వినియోగదారుల అవసరాన్ని బట్టి వేడిని సర్దుబాటు చేసుకునే ఆప్షన్స్ ఉడటం. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, దానికి అనుగుణంగా వేడిని పెంచుకోవచ్చు. నార్మల్ పెయిన్ ఉన్నప్పుడు, దానికి అనుగుణంగా కూడా తగ్గించుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ థర్మోథెరపీ విధానం నొప్పికి కారణమయ్యే కండరాల సంకోచాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
నెలసరి వచ్చిన ప్రతిసారీ ఆ నొప్పిని తట్టుకోలేక చాలామంది రకరకాల మాత్రలు వాడుతుంటారు. వాటికి బదులుగా ఇక నుంచి ఈ పీరియడ్స్ పెయిన్ రిలీఫ్ డివైజ్‌ను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. ఈ డివైజ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నెలసరి సమయంలో కూడా పనిచేసే మహిళలకు, ప్రయాణాలు చేసేవారికి ఇది ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటుంది.