 
					Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Deelip Kumar) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైలర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ విధంగా జైలర్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే జైలర్ 2(Jailer 2) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు ఇతర హీరోల సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు . ఇదేవిధంగా రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో కూడా టాలీవుడ్ హీరో బాలకృష్ణ సందడి చేయబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఈయన సుమారు 20 నిమిషాల పాటు సినిమాలో సందడి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా కోసం బాలయ్య భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలు పై చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు.
తాజాగా బాలకృష్ణ పాత్రకు సంబంధించి మరొక వార్త హల్చల్ చేస్తోంది. కొన్ని కారణాలవల్ల బాలకృష్ణ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బాలయ్య స్థానంలోకి మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తిచేసుకోనుంది.
డేట్స్ అడ్జస్ట్ కాలేదా?
ఇక బాలకృష్ణ(Balakrishna) ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం తన సినిమాలే అని చెప్పాలి త్వరలోనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కొత్త సినిమా షూటింగ్ పనులు కూడా ఉన్న నేపథ్యంలో కాల్ షీట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా నుంచి బాలయ్య తప్పుకోవడానికి సరైన కారణం తెలియదు కానీ బాలయ్య స్థానంలోకి ఫహద్ ఎంట్రీ ఇచ్చారని తెలియగానే, పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈయన సరిగ్గా సరిపోతారని అభిమానులు కూడా భావిస్తున్నారు.
Also Read: The Girl Friend Censor Review : రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రివ్యూ… ఏకంగా జాతీయ అవార్డే