 
					AUS vs IND: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd T20I ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ( Melbourne Cricket Ground ) వేదికగా జరిగిన రెండో టి20 లో టీమిండియా జట్టును చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ లో టీమిండియా విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6 వికెట్లు నష్టపోయి చేధించింది ఆస్ట్రేలియా. దీంతో ఈ రెండో టీ20లో ఏకంగా 4 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా.
ఈ విజయంతో 1-0 ఆధిక్యం సంపాదించుకుంది ఆస్ట్రేలియా. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, మెల్ బోర్న్ టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక మూడవ టి20 నవంబర్ రెండవ తేదీన హోబర్ట్ ( Bellerive Oval, Hobar)వేదికగా జరగనుంది. ఇందులో గెలిచిన కూడా టీమిండియా ఓడిపోతే, సిరీస్ కోల్పోవడం గ్యారంటీ. అదే టీమ్ ఇండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇక అంతకు ముందు టీమిండియా బ్యాటర్లు అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచారు. టాపార్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. అభిషేక్ శర్మ ఒక్కడే 37 బంతులు 68 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన హర్షిత్ రాణా 33 బంతుల్లో 35 పరుగులు చేసి దుమ్ము లేపాడు. వీళ్ళిద్దరూ మినహా ఏ ఒక్క ఆటగాడు కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. అందరూ 10 లోపు పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నారు. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ అలాగే బుమ్రా ముగ్గురు కూడా డకౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 18.4 ఓవర్స్ ఆడిన టీమిండియా 125 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు చేయగా డేంజర్ హెడ్ 28 పరుగులతో రాణించాడు. అటు జోష్ ఇంగ్లీస్ 20 పరుగులు చేశాడు. ఇక మిగిలిన ప్లేయర్లు చివరకు లక్ష్యాన్ని చేధించారు. 13.2 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యాన్ని చేధించింది ఆస్ట్రేలియా.
మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 లో టీమిండియా ఓటమికి కారణం గౌతమ్ గంభీర్ అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. సంజూ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, సూర్యను 4వ వికెట్ కు పంపించాడు. దూబే ఉండగా, హర్షిత్ రాణాను పంపించాడు గంభీర్. టీమిండియా బ్యాటింగ్ లైనప్ డిస్టర్బ్ అయింది.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
Abhishek Sharma now tops the list for most T20I runs after the first 25 innings for India — surpassing Virat Kohli! 🇮🇳🔥#India #T20Is #AbhishekSharma #Sportskeeda pic.twitter.com/Pw5wtNVscQ
— Sportskeeda (@Sportskeeda) October 31, 2025