EPAPER

Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ

Comedian Ali: సండే గర్ల్ ఫ్రెండ్ అంటున్న ఆలీ

Comedian Ali: కమెడియన్ ఆలీ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో  కనిపిస్తూ వస్తున్నాడు.  ఈ మధ్య  డబుల్ ఇస్మార్ట్ లో  కనిపించి.. ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత ఆయన  ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతుంది. అదే సండే గర్ల్ ఫ్రెండ్. కామ్నా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లార్విన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.


లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సుమన్, ఇంద్రజ, అలీ ఈ ప్రారంభోత్సవంలో అతిథులుగా పాల్గొన్నారు.సండే గర్ల్ ఫ్రెండ్ ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ క్లాప్ నివ్వగా, సుమన్ స్క్రిప్ట్ అందజేశారు. ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అతిథులు సండే గర్ల్ ఫ్రెండ్ చిత్ర బృందానికి తమ బెస్ట్ విషెస్ అందించారు.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు గడ్డం వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ .. “నేను ప్రస్తుతం సీఎం పెళ్లాం అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఆ సినిమా రాజకీయ నేపథ్యంతో మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. అయితే నా నెక్ట్ మూవీ అదే జానర్ లో కాకుండా పూర్తిగా నేటి ట్రెండ్ లవ్ స్టోరీతో చేస్తున్నాను. సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. పాటలు చాలా ట్రెండీ లిరిక్స్ తో కంపోజిషన్ తో ఉంటాయి. పాటల రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రతిభావంతులైన నటీనటులను మా మూవీలోకి తీసుకుంటాం. వారికి ఇదే మా ఆహ్వానం. త్వరలోనే సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు.


హీరోయిన్ కామ్నా శర్మ మాట్లాడుతూ – నేను ముంబై నుంచి వచ్చాను. సండే గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం అందించిన దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో ఆలీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Big Stories

×