BigTV English

ChatGPT:- రొమ్ము క్యాన్సర్‌కు కనిపెట్టగల చాట్‌జీపీటీ.

ChatGPT:- రొమ్ము క్యాన్సర్‌కు కనిపెట్టగల చాట్‌జీపీటీ.

ChatGPT:- ఓపెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, చాట్ జీపీటీ.. ఇవన్నీ లేకుండా టెక్ రంగం ముందుకు ఎలా వెళుతుందో అన్న పరిస్థితి వచ్చేసింది. చాట్ జీపీటీ అనేది మార్కెట్లోకి లాంచ్ అయ్యి కొన్ని నెలలే అయినా.. ఇప్పటికే దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్ కంపెనీలు ఆధారపడ్డాయి. కేవలం టెక్ కంపెనీలు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఇతర రంగాలు కూడా చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నాయి. అందులో మెడికల్ రంగం కూడా ఒకటి.


ఇప్పటికే మెడికల్ రంగంలో ఎన్నో చికిత్స విధానాల్లో ఓపెన్ ఏఐ సాయంగా ఉంటోంది. శారీరికమైన సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలకు కూడా ఏఐ చికిత్సను అందిస్తోంది. పలు ఆరోగ్య సమస్యల నిర్ధారణ విషయంలో కూడా ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు వైద్యులు. తాజాగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో కూడా మొదటిసారి ఏఐ సాయంగా నిలవనుంది. కానీ దీని స్క్రీనింగ్ జరిగిన తర్వాత కూడా వ్యాధి గురించి నిర్ధారించాలంటే వైద్యుల అభిప్రాయం తీసుకోవాల్సిందే అని నిపుణులు చెప్తున్నారు.

మామూలుగా మెడికల్ రంగంలో చాట్ జీపీటీ ఇస్తున్న సమాధానలు చాలావరకు సమయాల్లో కరెక్ట్‌గానే ఉన్నా కూడా అప్పుడప్పుడు మాత్రం అంత ఖచ్చితంగా ఉండడం లేదని నిపుణులు గమనించారు. 2023 ఫిబ్రవరిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి 25 ప్రశ్నలను సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు. వారు చాట్‌జీపీటీని ప్రతి ప్రశ్నను మూడుసార్లు అడిగారు. అడిగిన ప్రతీసారి సరైన సమాధానాలను అందించి వారిని ఆశ్చర్యపరిచింది. ఆపై చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాలు రేడియోలాజిస్ట్స్ పరీక్షించారు. 25 ప్రశ్నలలో 22 ప్రశ్నలకు చాట్ జీపీటీ సరైన సమాధానం ఇచ్చిందని వారు తెలిపారు.


చాట్ జీపీటీ సరైన సమాధానం ఇవ్వని ఆ మూడు ప్రశ్నలలో ఒకటి ఔట్‌డేటెడ్ అని శాస్త్రవేత్తలు అన్నారు. మిగతా రెండు ప్రశ్నలను అడిగినప్పుడు చాట్ జీపీటీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్పినట్టుగా వారు బయటపెట్టారు. 88 శాతం వరకు చాట్ జీపీటీ సమాధానాలు కరెక్ట్‌గా ఉండడం మంచి సూచన అని వారు అన్నారు. రేడియోలాజిస్ట్స్ కూడా ఈ విషయంలో సంతోషంగా ఉన్నారు. మామూలుగా వైద్యులు అందించిన విధంగా చాట్ జీపీటీ సమాచారాన్ని అందించలేదు కాబట్టి ఆ విషయంలో కూడా చాట్ జీపీటీకి స్పెషల్‌గా ట్రైనింగ్ అందించనున్నారు.

మరో మహమ్మారి హెచ్చరిక..! ఆఫ్రికాలో మొదలైన వైరస్..

for more updates follow this link:-Bigtv

Related News

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

HTC Wildfire E4 Plus: రూ.10000లోపు ధరలో 50MP కెమెరా, 5000 mAh బ్యాటరీ.. HTC వైల్డ్‌ఫైర్ E4 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మళ్లీ ప్రారంభం .. త్వరపడండి నాలుగు రోజులే

Big Stories

×