Samsung Galaxy: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎప్పుడూ వినూత్నతను చూపించే సామ్‌సంగ్ మరోసారి వినియోగదారుల కోసం కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ సామ్ సంగ్ గ్యాలక్సీ ఎఫ్17 5జి ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఫ్లాగ్ షిప్ ఫోన్లలో మాత్రమే కనిపించే గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను ఇందులో అందించడం. దీని వల్ల ఫోన్ స్క్రీన్ గీతలు పడకుండా, పడిపోవడాన్ని తట్టుకునేలా బలంగా ఉంటుంది.
6.6 అంగుళాల ఫుల హెచ్‌డి
డిజైన్ పరంగా చూస్తే స్టైలిష్ లుక్‌తో, స్లిమ్ బాడీతో, ప్రీమియం ఫినిషింగ్‌తో గెలాక్సీ ఎఫ్ 17, 5జి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఇచ్చిన 6.6 అంగుళాల ఫుల హెచ్‌డి ప్లస్ అమోలేడ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో మరింత స్మూత్ అనుభూతిని కలిగిస్తుంది. గేమింగ్ అయినా, వీడియో స్ట్రీమింగ్ అయినా ఈ డిస్‌ప్లే అదరగొడుతుంది.
రాబోయే టెక్నాలజీకి ఇది పర్ఫెక్ట్
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సాంమ్ సంగ్ ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 5జి ప్రాసెసర్‌ని ఉపయోగించింది. దీనివల్ల మల్టీ టాస్కింగ్ గానీ, హై గ్రాఫిక్స్ గేమ్స్ గానీ ఎటువంటి లాగ్ లేకుండా సాఫీగా నడుస్తాయి. 5జి కనెక్టివిటీ ఉండటం వల్ల రాబోయే టెక్నాలజీకి ఇది రెడీగా ఉంటుంది.
Also Read: Hyderabad Rain Today: ముంచెత్తిన మూసీనది.. చాదర్ ఘాట్ వంతెన మూసివేత
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
కెమెరా సెటప్ కూడా మంచి రేంజ్‌లో ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఇచ్చారు. ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. డే లైట్ అయినా, లో లైట్ అయినా ఫోటోలు క్వాలిటీగా రావడానికి AI ఫీచర్లు సహాయం చేస్తాయి.
5000mAh బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే, దీని అతిపెద్ద ఆకర్షణ 5000mAh బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడుకలో రెండు రోజులు వరకూ సులభంగా నడుస్తుంది. అదనంగా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల తక్కువ టైమ్‌లోనే ఎక్కువ ఛార్జ్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ
సెక్యూరిటీ పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో పాటు ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఇది తాజా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ తో రన్ అవుతుంది కాబట్టి కొత్త ఫీచర్లు, కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999
ధర పరంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 17 5 జి ను కంపెనీ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 6జిబి ర్యామ్ ప్లస్ 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా నిర్ణయించగా, 8జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ వేరియంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిపి గాలాక్సీ ఎఫ్17 5జి ని మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారుల కోసం ఒక మంచి ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి.