BigTV English
Advertisement

China Over cross America in science : అమెరికాను బయటపెడుతున్న చైనా.. సైన్స్ విషయంలో.

China  Over cross America in science : అమెరికాను బయటపెడుతున్న చైనా.. సైన్స్ విషయంలో.

China Over cross America in science : సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే ముందుగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి. ఇప్పటివరకు అక్కడ ఉన్న సైన్స్, టెక్నాలజీ వేరే దేశంలో లేవని అక్కడి ఎక్స్‌పర్ట్స్ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అమెరికాకు షాకిస్తూ సైన్స్ విభాగంలో మరో దేశం ముందుకొచ్చింది.


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హై క్వాలిటీ సైన్స్ విధానాన్ని చైనా శాసించే స్థాయికి ఎదిగిందని నిపుణులు గుర్తించారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో పోలిస్తే చైనా శాస్త్రవేత్తలు పరిశోధనల విషయంలో వేగం చూపిస్తున్నారని వారు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించడమే దీనికి కారణమని తెలుస్తోంది.

సైన్స్ విభాగంలో చైనా ఎదుగుదల చూసి నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. దాని కారణంగా త్వరలోనే ప్రపంచ సైన్స్‌ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని అమెరికా భయపడుతోంది. ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో టాప్‌లో ఉండాలని చైనా తన దేశ పాలిసీల్లో సూచించినట్టుగా వారు గుర్తించారు.అందుకే చైనాతో తలపడడానికి అమెరికా సిద్ధపడుతోంది.


2000 తర్వాత చైనా చాలావరకు యువతను ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేలా అనుమతినిచ్చింది. అందులో చాలావరకు సైన్స్ అండ్ టెక్నాలజీని చదువుకోవడానికి ఎంచుకున్నారు. కొందరు విద్యార్థులు చదువుకోవడానికి వెళ్లినా దేశాల్లో సెటిల్ అయినా.. మిగతవారు మాత్రం తిరిగి చైనాకు వచ్చే అక్కడే తమ కెరీర్‌ను ప్రారంభించారు. ఇది చైనా సైన్స్‌ను మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడింది.

ప్రస్తుతం అమెరికా తర్వాత సైన్స్ విభాగంలో ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశం చైనానే. 2017లో అమెరికాకంటే చైనా ఎక్కువ పరిశోధనలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. మొదట్లో చైనా ఎలాంటి పరిశోధన చేసినా పలు ప్రపంచ దేశాలు వాటిని కొట్టిపారేశాయి. కానీ తర్వాత చైనా సైన్స్‌లో పెరిగిన క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

చైనా తమకు పోటీనిస్తుంది అని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు ఎలర్ట్ అయ్యారు. అందుకే అమెరికా చేసిన పలు రిసెర్చ్‌లకు చైనాకు యాక్సెస్ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే సైన్స్ విభాగంలో చైనా ఎదుగుదలను ఆపడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టిందని అర్థమవుతోంది. కానీ అమెరికా, చైనా వంటి దేశాలు కలిసి పనిచేస్తే సైన్స్ అనేది మరింత క్వాలిటీతో బయటికి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Free AI: ఉచిత ఏఐ ఒక ఉచ్చు.. భారతీయులే వారి ప్రొడక్ట్!

Battery Phones Under Rs10k: రూ.10,000 లోపు బడ్జెట్‌లో 5000mAh బ్యాటరీ ఫోన్లు.. 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు

Vivo 5G Premium Smartphone: వివో నుంచి ప్రీమియం 5జి ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Nokia Magic Max 5G: 2800 ఎంపీ కెమెరాతో నోకియా ఎంట్రీ.. మ్యాజిక్ మ్యాక్స్ 5జీ రివ్యూ

2026 Honda Civic Type R: హోండా సివిక్ టైప్ ఆర్ 2026.. ఈ కార్‌లో జర్నీ చేస్తే దిగాలన్న ఫీలింగే రాదు మావా

Samsung Galaxy S23 5G: ఇంత తక్కువ ధరలో 5G ఫోన్ వస్తుందా.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!

OPPO Reno 15 Mini Phone: రూ.33వేల లోపే ఒప్పో రెనో 15 మినీ ఫోన్.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌కి రేడీ అవ్వండి

Vivo Y31 5G Phone Offers: క్రేజీ డిస్కౌంట్ భయ్యా.. వివో Y31 ఫీచర్స్ తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Big Stories

×