E-Paper
Advertisement

Shahrukh condition to Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌

Shahrukh condition to Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌
Advertisement

Shahrukh condition to Ram Charan : బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. దీపికా పదుకొనె, జాన్ అబ్ర‌హం కూడా ఈ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం ప‌ఠాన్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలతో చిత్ర యూనిట్‌ బిజీగా

ఈ క్ర‌మంలో షారూఖ్ ఖాన్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో #AskSRK సెష‌న‌ల్‌లో పాల్గొన్నారు. ఇందులో త‌న ఫ్యాన్స్‌, నెటిజ‌న్స్‌ను ఆయ‌న ప్ర‌శ్న‌లు వేయ‌మ‌న్నారు. అందులో ఆయ‌న కొన్ని ఫ‌న్నీ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. అలాంటి ప్ర‌శ్న‌ల్లో ఓ ప్ర‌శ్న దానికి షారూఖ్ ఖాన్ ఇచ్చిన స‌మాధానం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Advertisement

ఓ అభిమాని షారూఖ్‌తో ‘‘హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్‌కి వ‌స్తారా?’ అని ప్ర‌శ్నించాడు. దానికి షారూఖ్ ఖాన్ స‌మాధానం చెబుతూ ‘తప్పకుండా.. అయితే నన్ను రామ్ చరణ్ తీసుకెళితేనే వస్తాను’ అన్నారు. షారూఖ్ ఇచ్చిన సమాధానం.. అందులో మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ షారూఖ్ ఖాన్‌, రామ్ చ‌ర‌ణ్ ఇలా వారి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌టం ఇదేమీ కొత్త కాదు. జ‌న‌వ‌రి 10న ప‌ఠాన్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌నలు తెలిపారు. అప్పుడు షారూక్ స్పందించిన సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న‌ల్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా ఆయ‌న రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌స్తావించ‌టం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతుంది.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×