E-Paper
Advertisement

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!
Advertisement

Smart frige power consumption: ఈ రోజుల్లో మన ఇళ్లలో ప్రతి వస్తువు ‘స్మార్ట్’ అయిపోతోంది. టీవీలు, ఫోన్ల తర్వాత ఇప్పుడు కిచెన్‌లోకి స్మార్ట్ ఫ్రిజ్‌లు కూడా వచ్చేసాయి. వై-ఫై కనెక్టివిటీ, టచ్ స్క్రీన్లు, లోపల ఏముందో ఫోన్లోనే చూసుకునే.. కెమెరాలతో ఇవి మనల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఈ స్మార్ట్ ఫ్రిజ్‌లు కొంటే నిజంగానే మన కరెంట్ బిల్లులు తగ్గి, డబ్బులు ఆదా అవుతాయా ? లేదా ఇదంతా కేవలం కంపెనీల మార్కెటింగ్ స్టంటా? అనే అనుమానం చాలా మందిలో ఉంది. స్మార్ట్ ఫ్రిజ్‌లు కరెంట్‌ను ఎలా ఆదా చేస్తాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫ్రిజ్‌లు కరెంట్ బిల్లును తగ్గిస్తాయా?

Advertisement

సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే స్మార్ట్ ఫ్రిజ్‌లలో కరెంట్ ఆదా చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయి. అవి పని చేసే విధానం ..

ఇన్‌స్టా వ్యూ డోర్: మనం ఫ్రిజ్‌లో ఏముందో చూడ్డానికి రోజూ ఎన్నో సార్లు డోర్ తీస్తూ.. వేస్తూ ఉంటాం. అలా చేసిన ప్రతిసారీ లోపలి కూలింగ్ బయటకు పోయి, కంప్రెసర్ మళ్ళీ ఎక్కువ కరెంట్ వాడుకుంటుంది. స్మార్ట్ ఫ్రిజ్‌లలో డోర్ తీయకుండానే.. బయట నుంచే.. లోపల ఏముందో చూడొచ్చు (ఉదాహరణకు LG ఇన్‌స్టా వ్యూ లో రెండు సార్లు టాప్ చేస్తే లోపల లైట్ వెలుగుతుంది). దీని వల్ల కోల్డ్ ఎయిర్ బయటకు పోదు. కరెంట్ కూడా ఆదా అవుతుంది.

Advertisement

ఏఐ ఎనర్జీ మోడ్ : లేటెస్ట్ స్మార్ట్ ఫ్రిజ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటోంది. ఇది మీ ఇళ్లలో ఫ్రిజ్ వాడే పద్ధతిని గమనిస్తుంది. అంటే.. మీరు రాత్రి పూట ఫ్రిజ్ డోర్ ఎక్కువగా తీయరని గ్రహించి, ఆ సమయంలో ఆటోమేటిక్‌గా పవర్ కన్జంప్షన్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల దాదాపు 10% నుంచి 15% వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.

స్మార్ట్ నోటిఫికేషన్లు: ఇంట్లో పిల్లలు లేదా మనం ఎప్పుడైనా ఫ్రిజ్ డోర్ సరిగ్గా వేయకుండా మర్చిపోతే.. వెంటనే మీ మొబైల్‌కు “డోర్ ఓపెన్ ఉంది” అని అలర్ట్ మెసేజ్ వస్తుంది. దీని వల్ల గంటల తరబడి ఫ్రిజ్ వృథాగా రన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు.

చిన్న ట్విస్ట్!
స్మార్ట్ ఫ్రిజ్‌లు కరెంట్‌ను ఆదా చేస్తాయనేది నిజమే అయినప్పటికీ.. వాటిలో ఉండే వై-ఫై, టచ్ స్క్రీన్ డిస్‌ప్లేలు రన్ అవ్వడానికి కూడా కొద్దిగా అదనపు పవర్ అవసరమవుతుంది. కానీ.. ఇన్వర్టర్ కంప్రెసర్, ఏఐ టెక్నాలజీ వల్ల ఆ చిన్న పవర్ వాడకం పెద్దగా ప్రభావం చూపదు. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఇవి నార్మల్ ఫ్రిజ్‌ల కంటే తక్కువ కరెంట్‌నే వాడుకుంటాయి.

స్మార్ట్ ఫ్రిజ్‌లు ఫీచర్లను బట్టి కొంచెం లగ్జరీ విభాగంలోకి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ బ్రాండ్స్, వాటి ధరల వివరాలు ఇవే..

Samsung 653 L Frost Free Convertible 5-in-1 Smart Refrigerator: ఇది వై-ఫై కనెక్టివిటీ, స్మార్ట్‌థింగ్స్ యాప్ సపోర్ట్, ఏఐ ఎనర్జీ మోడ్‌తో వస్తుంది.

ధర: దీని బేసిక్ సైడ్-బై-సైడ్ మోడల్ ధర సుమారుగా రూ. 75,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుంది.

Samsung Family Hub Smart Fridge (With Touch Screen): దీని డోర్‌కు పెద్ద టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా పాటలు వినొచ్చు, లోపల ఉన్న వస్తువులను ఫోన్లో చూడొచ్చు.

ధర: ఈ అల్ట్రా-ప్రీమియం మోడల్ ధర సుమారు రూ. 1,85,000 వరకు ఉంటుంది.

LG 655 L Wi-Fi Inverter Side-by-Side Refrigerator: ఎల్‌జీ కి చెందిన ఈ స్మార్ట్ ఫ్రిజ్ థిన్‌క్యూ  యాప్ సపోర్ట్ , అద్భుతమైన ఎనర్జీ సేవింగ్‌తో వస్తుంది.

ధర: దీని మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,10,000 వరకు ఉంది.

స్మార్ట్ ఫ్రిజ్‌లు ఖచ్చితంగా కరెంట్ బిల్లును ఆదా చేస్తాయి. కానీ.. సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే వీటి ధర (ఇన్వెస్ట్‌మెంట్) చాలా ఎక్కువ. మీరు కేవలం కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి మాత్రమే అయితే అంత డబ్బు పెట్టనవసరం లేదు. కానీ.. కరెంట్ ఆదాతో పాటు రిమోట్ కంట్రోల్, అడ్వాన్స్డ్ కూలింగ్, వంటగదికి మోడరన్ లుక్ , లగ్జరీ ఫీచర్లు కావాలనుకుంటే మాత్రం స్మార్ట్ రిఫ్రిజిరేటర్ మీ డబ్బుకు వంద శాతం న్యాయం చేస్తుంది.

Related News

క్రోమా ఫ్లాష్ సేల్ ధమాకా.. గూగుల్ పిక్సెల్ 10 మెుబైల్‌పై.. ఏకంగా రూ.14,091 తగ్గింపు!

డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం

స్మార్ట్‌వాచ్‌తో షుగర్ టెస్ట్ సాధ్యమేనా? అసలు గుట్టు విప్పిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ!

ఎయిర్‌టెల్ ఫన్ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, హాట్‌స్టార్ ఫ్రీ.. 3.3TB డేటాతో మీ ఇష్టం!

బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్.. వర్షాకాలంలోనూ నో టెన్షన్

జియో సూపర్ హిట్ ప్లాన్.. అపరిమిత 5G, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

పవర్ సేవింగ్స్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ.. ఈ ఫ్రిజ్‌లతో మీ ఇల్లు సూపర్ స్మార్ట్!

ఈ సోలార్ సిస్టమ్ మీ ఇంట్లో ఉంటే ప్రభుత్వం మీకే డబ్బులు చెల్లిస్తుంది.. ఎలాగంటే?

Big Stories

Advertisement
×