Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ మీరు కొనాలనుకునే ఏదైనా వస్తువు గురించి ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మీరు అంతసేపు ఏ ప్రొడక్ట్ గురించి మాట్లాడారో సరిగ్గా అదే యాడ్ రూపంలో మీ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో వచ్చిందా. ఇలాంటి అనుభం సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్కసారైనా ఎదురై ఉంటుంది. దీంతో మనం మాట్లాడే మాటలను స్మార్ట్‌ఫోన్ ద్వారా టెక్నాలజీ వింటుందా అనే సందేహం రాని వారంటూ ఉండరు.
కొన్ని సార్లయితే మనసులో అనుకున్నది కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందనేది కనీసం అర్థం కూడా అవ్వదు. ఒకవేళ నిజంగానే అలాంటి ఒక టెక్నాలజీతో మనుషుల మాటలను సోషల్ మీడియా యాప్స్ వింటున్నాయా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. గతంలో కూడా రీల్స్ చూస్తూ ఏం మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్ ఫీడ్‌లో వస్తోందని చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో నిజంగానే మాటలను సోషల్ మీడియా యాప్స్ వింటున్నాయని జోరుగా ప్రచారం జరిగింది.
ఇక దీని గురించి ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సరీ కూడా స్పిందించారు. ఫోన్‌లో ఉండే మైక్రోఫోన్ ద్వారా మనుషులు ఏం మాట్లాడుతున్నారు అనేది వినే ఫీచర్ తమ యాప్‌లో లేదని ఆయన చెప్పారు. యూజర్‌కు సంబంధించిన ఏరకమైన పర్సనల్ డేటా కూడా యాప్‌కి తెలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: ఒత్తిడి వల్ల వెన్నునొప్పి వస్తుందా..?
యాడ్స్ ఎలా ?
అయితే ఈ యాడ్స్ ఎలా వస్తున్నాయనే దాని గురించి మాత్రం ఇప్పటికీ చాలా మందికి లెక్కలేనన్ని డౌట్స్ వస్తునే ఉన్నాయి. యాప్ వినడం పక్కన పెడితే ఫోన్ డేటాను ట్రాక్ చేసే టెక్నాలజీ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందట. అంటే ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నామనే డేటా మొత్తం ఈ యాప్ చేతిలోకి వెళ్తుంది. ఏరకమైన వెబ్‌సైట్స్ వాడుతున్నారు. దేని కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారనేది కూడా దీనికి తెలుస్తుందట.
అలాగే యాడ్ ప్రెఫరెన్సెస్ వంటి వాటి ఆధారంగా యాప్‌లో ఫీడ్ వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన డేటా కూడా సోషల్ మీడియా యాప్స్‌కి వెళ్లడం ఇష్టం లేదు అనుకున్నవారు ప్రైవసీ సెట్టింగ్స్‌ని మార్చుకోవడం మంచిది.