BigTV English

SreeLeela: పండుగ వేళ శ్రీలీలకు చేదు అనుభవం.. అసలేమైందంటే..?

SreeLeela: పండుగ వేళ శ్రీలీలకు చేదు అనుభవం.. అసలేమైందంటే..?

SreeLeela..సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారు ఒంటరిగా జనాలలోకి వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా అభిమానుల ధాటికి తట్టుకోలేక సెక్యూరిటీని కూడా నియమించుకుంటూ ఉంటారు. అయితే అభిమాన హీరోయిన్ లేదా హీరో బయట పబ్లిక్ లో కనిపించారు అంటే వారితో ఫోటోలు దిగాలని, కరచాలనం చేయాలని, వారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అభిమానులు ఎగబడతారు.. ఇది సహజం. కానీ అభిమానుల ప్రేమకు సెలబ్రిటీలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అయిపోయి చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ‘శ్రీరామనవమి’ సందర్భంగా తాజాగా పండుగ వేళ హీరోయిన్ శ్రీలీల (Sree Leela) కు చేదు ఘటన ఎదురవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


పండుగ వేళ హీరోయిన్ శ్రీ లీలాకి చేదు అనుభవం..

అసలు విషయంలోకెళితే ప్రస్తుతం శ్రీ లీల బాలీవుడ్ లో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో కలిసి ‘ఆషిఖీ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగు సిక్కిం లో జరుగుతోంది. ఆ రోజు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక.. అక్కడే జరిగిన ఒక ఈవెంట్ కి శ్రీలీలతో పాటు కార్తీక్ ఆర్యన్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఆ ఈవెంట్ కి శ్రీ లీలా, కార్తీక్ ఇద్దరు వస్తున్నారని తెలియడంతో అభిమానులు, జనాలు బాగానే వచ్చారు. అయితే వాళ్ల మధ్యలో నుంచి శ్రీ లీలా, కార్తీక్ ఆర్యన్ బౌన్సర్ల సహాయంతో నడిచి వెళుతుంటే.. శ్రీ లీల చెయ్యి పట్టుకొని కొంతమంది జనాలు పక్కకి లాగేసారు. దీంతో ఈ సంఘటనకు శ్రీ లీల ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇక వెంటనే అక్కడున్న బౌన్సర్లు తేరుకొని శ్రీ లీలను తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.


ఫ్యాన్స్, బౌన్సర్లపై మండిపడుతున్న నెటిజన్స్..

ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు .ఒక స్టార్ హీరోయిన్.. పైగా ఒక అమ్మాయిని అభిమానులు అలా చేయి పట్టుకొని లాగుతుంటే బౌన్సర్లు ఏం చేస్తున్నారు? అంటూ వారిపై మండిపడుతున్నారు. అంతేకాదు ఒక అమ్మాయితో అలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. ఇక శ్రీలీల విషయానికి వస్తే కన్నడ బ్యూటీగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి రెండు మూడు చిత్రాలతోనే భారీగా పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఒకే ఏడాది భారీ సంఖ్యలో సినిమాలకు సైన్ చేసి బొక్క బోర్ల పడింది. దీనికి తోడు ఈమె నటించిన ఏ సినిమా కూడా ఈమెకు గుర్తింపును అందివ్వలేదు. పైగా కొన్ని సినిమాలు పట్టాలెక్కకుండానే ఆగిపోయాయి. మరికొన్ని చిత్రాలలో ఈమెకు డిజాస్టర్ రావడం చూసి ఈమెను తప్పించారు కూడా.. అలా చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఈమె ఇప్పుడు బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో అక్కడ శ్రీ లీలాకి జరిగిన చేదు అనుభవానికి ఆమె కాస్త ఫీల్ అయినట్టు తెలుస్తోంది. మరి దీనిపై శ్రీ లీల ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

ALSO READ;Vaishnavi Chaitanya: ఎట్టకేలకు డ్రీమ్ ప్రాజెక్టు పై నోరు విప్పిన వైష్ణవి చైతన్య.. ఎప్పటికైనా ఆ పాత్ర చేయాలి

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×