BigTV English

Back Pain: ఒత్తిడి వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందా..? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

Back Pain: ఒత్తిడి వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందా..? దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

Back Pain: నిద్రలేమి, పని ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతారు. దీని వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారిరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మందికి యాంగ్జైటీ సమస్య వచ్చే ఛాన్స్ ఉందట.


మరికొందరిలో దీని వల్ల విపరీతమైన మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఒత్తిడి కారణంగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. ఇప్పటికే ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారిలో చాలా మందికి వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మానసిక ఒత్తిడి వల్ల శరీరంలోని కండరాలపై చెడు ప్రభావం పడుతుందట. ముఖ్యంగా నడుము, భుజాలు, మెడ ప్రాంతాలలో ఉండే కండరాలు దెబ్బతినే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వెన్ను నొప్పి రావొచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు.


ALSO READ: అమ్మాయిలకు బట్టతల ఎందుకు రాదు..?

కొన్ని సార్లు ఒత్తిడి కారణంగా రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయట. బ్లడ్ సర్క్యూలేషన్ సరిగా జరగనప్పుడు వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందట. కొంత మంది ఎక్కువ సమయం పాటు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉంటారు. దీని వల్ల కూడా వెన్ను ఎముకపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందట. ఫలితంగా వెన్ను నొప్పి రావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

అధిక బరువులు ఎత్తడం, లేదా రెస్ట్ లేకుండా పని చేయడం వల్ల కూడా వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయట. మరికొందరిలో నిద్రలేమి వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందట.

వెన్ను నొప్పి తగ్గాలంటే..?
వెన్ను నొప్పి తగ్గాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రపోకుంటే కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్ను నొప్పి వస్తుందట. ఇలా జరగకుండా ఉండాలంటే రోజుకు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, బ్రీతింగ్ ఎక్సర్సై్జ్ వంటివి అలవాటు చేసుకోవాలి. అలాగే డెస్క్ వర్క్ చేసే వారు గంటకు ఒకసారి బ్రేక్ తీసుకొని 5 నిమిషాలు వాకింగ్ చేయాలి.

వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో యూరిక్ యాసిడ్ కంటెంట్ పెరిగితే వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉందట. అందుకే వీలైనంత వరకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×