BigTV English

Flipkart Big Billion Days Sale : అదిరే ఆఫర్.. రూ.37,000 ల్యాప్టాప్ కేవలం రూ.10,000కే!

Flipkart Big Billion Days Sale : అదిరే ఆఫర్.. రూ.37,000 ల్యాప్టాప్ కేవలం రూ.10,000కే!

Flipkart Big Billion Days Sale :  టాప్ బ్రాండ్ హై క్వాలిటీ ల్యాప్ టాప్ కావాలా? ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరమయ్యే ల్యాప్ టాప్స్ కొనాలంటే కనీసం రూ. 50,000 ఉండాలి. అందులో టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్ట్స్ లక్షల్లో ఉంటాయి. స్టూడెంట్స్ కు అవసరమయ్యే క్వాలిటీస్ ఉన్న ల్యాప్ టాప్స్ కూడా రూ. 40,000 దాటే ఉంటున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రూ. 10,000లకే ల్యాప్ టాప్ వస్తే ఎవరైనా నమ్ముతారా? అది కూడా అదిరిపోయే ఫీచర్స్ తో HP ల్యాప్ టాప్ ఆఫర్లో వస్తే అస్సలు నమ్మలేరు కదా.. కానీ నిజమే ఫిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2024లో భాగంగా హై క్వాలిటీ ల్యాప్ ట్యాప్స్ పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో హెచ్ పీ ల్యాప్ టాప్ ను రూ.10వేలలోపే కొనే అవకాశం వచ్చింది.


ఫిప్కార్ట్ ఫెస్టివల్ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించింది. లిమిటెడ్ డీల్స్ తో అదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చింది. టాప్ బ్రాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ పై అద్భుతమైన డీల్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ల్యాప్ టాప్స్ పై బెస్ట్ డీల్స్ నడుస్తున్న నేపథ్యంలో… హెచ్‌పీ టచ్ క్రోమ్‌ బుక్ మీడియా టెక్ ఎంటీ 8183 11 ఎంకే జీ9 క్రోమ్ బుక్ (11MK G9 EE) ల్యాప్‌టాప్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 37,241 ఉండగా ఆఫర్ లో రూ. 10,990కే లభిస్తుంది. ఇక ఫీచర్స్ సైతం అధ్బుతంగా ఉండటమే కాకుండా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసే వారికి డిస్తౌంట్ సైతం అందిస్తుంది.

ALSO READ : తగ్గేదేలే… తెగ కొనేస్తున్నారుగా.. ఆ ప్రొడక్ట్స్​కు ఫుల్ డిమాండ్​!


ఈ ల్యాప్ టాప్ లో 4 GB RAM, 32 GB స్టోరేజ్ కెపాసిటీ ఉండనుంది. మీడియా టెక్ ప్రోసెసర్ MT8183 ప్రోసెసర్ ఉంది. స్క్రీన్ సైజ్ 29.46cm (11.6 ఇంచులు), స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 Pixel, వెబ్ కెమెరా 720p HDగా ఉంది. ఇందులో ఒక యూఎస్‌బీ పోర్ట్ 2.0 టైప్ A పోర్ట్, ఒక సూపర్ స్పీడ్ యూఎస్‌బీ టైప్ సీ 5 జీబీపీఎస్ సిగ్నలింగ్ రేటు పోర్ట్ ఉన్నాయి. స్క్రీన్ టైప్ హెచ్‌డీ, ఐపీఎస్, యాంటీ గ్లేర్ ఉన్నాయి. స్పీకర్లు, మైక్స్, వెబ్ కెమెరా ఉన్నాయి. డిస్క్ డ్రైవ్ ఆఫ్షన్ లేని ఈ ల్యాప్ టాప్ లో వెబ్‌కెమెరా, కీబోర్డు ఉంటుంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌పై ఏడాది వరకు వారంటీ సైతం ఉంది. ఇక బడ్జెట్ ధరలోనే కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫ్షన్.

బ్యాంక్ ఆఫర్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5%, HDFC క్రెడిట్ కార్డు కొనుగోలుపై 10% డిస్కౌంట్ లభించనుంది. దీంతో రూ. 1250 తగ్గటంతో ఈ ల్యాప్ టాప్ ను రూ. 9,990 కొనే అవకాశం ఉంటుంది. ఈఎమ్ఐ సదుపాయం సైతం ఉండటంతో HDFC క్రెడిట్ కార్డు ఇన్టాల్మెంట్ లో కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ కొనుగోలుపై షరతులు వర్తిస్తాయని ఫ్లిప్కార్ట్ తెలిపింది.

 

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×