BigTV English

Pomegranate Peels Face Pack: దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్‌.. మీ అందం రెట్టింపు

Pomegranate Peels Face Pack: దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్‌.. మీ అందం రెట్టింపు

Pomegranate Peels Face Pack: దానిమ్మలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ గింజలు కాదు దాని తొక్కలు కూడా అంతే మేలు చేస్తాయి. చర్మ సంరక్షణలో దానిమ్మ తొక్కలు చాలా ఉపయోగపడతాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం దానిమ్మ తొక్కలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


దానిమ్మ తొక్కల వల్ల ప్రయోజనాలు..

దానిమ్మ తొక్కలు మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. మార్కెట్‌లో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా వెనకాడరు. కానీ అలా కాకుండా తక్కువ ఖర్చుతో కూడా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. దానిమ్మ తొక్కలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. దానిమ్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలుసు.. కానీ దానిమ్మ తొక్కలు ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి.


మనలో చాలామంది దానిమ్మ తొక్కలను పనికిరానిదిగా భావించి వాటిని విసిరివేస్తారు. కానీ అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిలో పోషకాల భాండాగారం దాగి ఉంది. దానిమ్మ తొక్కను ఉపయోగించడం వల్ల ఎలాంటి చర్మ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మొటిమలు:
దానిమ్మ తొక్కలలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. వారానికి రెండుసార్లు దానిమ్మ తొక్క పొడిని ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.

డార్క్ స్పాట్స్, మార్క్స్:
ముఖంపై డార్క్ స్పాట్స్ ఉంటే అవి మిమ్మల్ని పెద్దవారిగా చేస్తాయి. దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. దీని వల్ల డార్క్ స్పాట్స్ తగ్గుతాయి.

చర్మాన్ని బిగుతుగా చేస్తుంది:
చర్మంపై మొటిమలు రావడం ప్రారంభమయ్యే వ్యక్తులకు దానిమ్మ తొక్కలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దానిమ్మ తొక్కలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.

చర్మానికి పోషణ నిస్తుంది:
దానిమ్మ తొక్కలో విటమిన్ సి, ఇతర పోషకాలు ఉంటాయి. అందుకే దానిమ్మ తొక్కలను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మానికి పూర్తి పోషణ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also Read: ఇంట్లోనే మొటిమలను తగ్గించే మార్గాలివే

నూనెను నియంత్రిస్తుంది:
చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో దానిమ్మ తొక్కలను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలు చర్మం నుంచి అదనపు నూనెను గ్రహించి, మృదువుగా చేస్తుంది.

దానిమ్మ తొక్కలతో ఫేస్ ప్యాక్ :

ఎండిన దానిమ్మ తొక్కలను గ్రైండ్ చేసి పొడి చేయండి. ఈ పొడిని పెరుగు , తేనెతో కలిపి ముఖానికి పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది.

ఇదే కాకుండా దానిమ్మ తొక్కలను ఉడకబెట్టి ఫేస్ట్ లాగా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×