BigTV English
Advertisement

Trolling Effect: ట్రోలింగ్ బ్యాచ్‌కు సినిమా చూపించనున్న సీఎం రేవంత్.. చెత్త పోస్టులు చేస్తే చిత్తడే

Trolling Effect: ట్రోలింగ్ బ్యాచ్‌కు సినిమా చూపించనున్న సీఎం రేవంత్.. చెత్త పోస్టులు చేస్తే చిత్తడే

Trollings Effect: ఏదైనా శృతి మించితే.. అనర్ధాలు పలకరిస్తాయి… ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ సెగ ఎక్కువైంది. మహిళలని కూడా చూడకుండా.. ట్రోలింగ్స్ విపరీతమైన నేపథ్యంలో మహిళా సమాజం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలన్న వాదన సైతం ఎక్కువగా వినిపిస్తోంది. ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా గతంలో ఒక మహిళా నేతపై చేసిన ట్రోలింగ్ విమర్శలకు గురైంది. అయితే ఆ విషయంలో ఆ మహిళా నేతకు ఎందరో మహిళలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం అండగా నిలిచారు. తాజాగా మరో మహిళా నేతకు ట్రోలింగ్స్ ఎఫెక్ట్ పెద్ద తలనొప్పిలా మారింది. ఇక ఈ విషయంలో ఉపేక్షించకూడదని రేవంత్ సర్కార్ భావిస్తోంది.


సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి కళ్ళెం వేయకుంటే ఇక ఇబ్బందులే అన్న భావనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాగే ఇటీవల హైడ్రా కూల్చివేతలపై సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అధికం కాగా, ఈ విషయం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిలా మారింది. ఎక్కడ ఏ కూల్చివేతలు జరిగినా.. అది హైడ్రాకే సంబంధం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు. అలాగే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా ఇటీవల కొందరు ఉద్దేశపూరితంగా ఈ ట్రోలింగ్స్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఈ విషయంలో కఠిన చర్యలు ప్రభుత్వం ముందడుగు వేస్తున్న తరుణంలో.. ఏకంగా ఓ మహిళా మంత్రి తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ పట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకంగా ఓ మంత్రి తనపై వచ్చిన ట్రోలింగ్స్ పై స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిని బట్టి.. ఇక ఆ ట్రోలింగ్స్ ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పవచ్చు. పలు యూట్యూబ్ ఛానళ్లు కావాలనే దురుద్దేశపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారం. అంతేకాదు మహిళా నేతల, రాజకీయ ప్రముఖుల నేతల ఫోటోలు మార్ఫింగ్ చేయడం.. వాటిని ఇష్టారీతిన పోస్ట్ చేయడంతో అధికార, ప్రతిపక్ష నేతలు సైతం కొంత ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది.


Also Read: Musi redevelopment project: మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం వెనుక.. చేతులు మారిన వందల కోట్లు

అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ట్రోలింగ్స్ ని ఉపేక్షించకూడదని ఒక నిర్ణయానికి వచ్చిందట. అలాగే ఇప్పటికే అసలు ట్రోలింగ్స్ చేస్తున్న ఐడీస్ సమాచారం కూడా సేకరించినట్లు.. ఇక మహిళలను వేధిస్తున్న ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందట. ఫేక్ ఐడిలతో ట్రోలింగ్స్ చేసినా.. వారి అంతు తేల్చే పనిలో పోలీసులు సైతం నిమగ్నమయ్యారు. గీత దాటితే.. ఇక ఖబడ్దార్ అనే రీతిలో ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని, మహిళా లోకానికి ఈ ట్రోలింగ్స్ నుండి విముక్తి పొందేందుకు చర్యలు తీసుకోవడం పట్ల.. మహిళలు, మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, ట్రోలింగ్స్ చేయాలన్న ఆలోచన కూడా ఇక ఎవరికీ రాకుండా.. చట్టప్రకారం ప్రభుత్వం వారిని శిక్షించేందుకు పకడ్బందీగా కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం.

Related News

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Jubilee Hills By Elections: ఇంకా రెండు రోజులే టైం.. జూబ్లీహిల్స్ ఎన్నికలపై టెన్షన్ టెన్షన్..

Defecting MLAs: కొనసాగుతున్న రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..

Maganti Family Issue: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×