Big Stories

TVS Apache RTR 160 2V Review: టీవీఎస్ అపాచీ RTR 160 ఫుల్ రివ్యూ.. ఇదే రియాలిటీ!

TVS Apache RTR 160 2v Bike Full Review: దేశీయ దిగ్గజ టూ వీలర్ కంపెనీ టీవీఎస్ అపాచీ RTR 160 2v కొన్ని నెలల క్రితం కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. ఈ కొత్త అప్‌డేట్‌లో కంపెనీ కొన్ని టెక్ ఫీచర్‌లతో పాటు కొత్త గ్రాఫిక్స్ డిజైన్‌ను యాడ్ చేసింది. దీని కారణంగా ఈ బైక్ పాత వెర్షన్ కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. కొత్త రైడింగ్ మోడ్‌లను కూడా అందించింది. ఇది పర్ఫామెన్స్‌లో పాత అపాచీ పీల్‌ ఇస్తుంది. అయితే టీవీఎస్ అపాచీని ఇప్పటికే అనేక అప్‌డేట్‌లతో తీసుకొచ్చింది. ఈ బైక్ రైడింగ్, మైలేజ్ తదితర వివరాలను తెలుసుకోండి.

- Advertisement -

TVS అపాచీ RTR 160 2v లుక్-డిజైన్ విషయానికి వస్తే ఈ కొత్త మోడల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. పెర్ఫామెన్స్‌లో ఇది పాత అపాచీ అనుభూతిని ఇస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌లో కంపెనీ కొత్త రైడింగ్ మోడ్‌ను కూడా అందించింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది.  కంపెనీ ఫ్రంట్ హెడ్‌ల్యాంప్, ప్రొజెక్టర్ ల్యాంప్‌ను పూర్తిగా LED చేసింది. మీరు వెనుక ప్రొఫైల్‌లో LED టెయిల్ ల్యాంప్‌ను చూస్తారు. సైడ్ ఇండికేటర్లలో చిన్నచిన్న మార్పులు చేశారు. అయితే ఇందులో ఇప్పటికీ హాలోజన్ బల్బులు ఉపయోగిస్తున్నారు. మీరు కొత్త అపాచీలో కొత్త గ్రాఫిక్స్ డిజైన్‌ను చూడవచ్చు. బైక్‌పై TVS రేసింగ్ అని రాసి ఉంటుంది .

- Advertisement -

Also Read: ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఏది కొనాలి?

TVS Apache RTR 160 మొత్తం వేరియంట్‌లలో డ్రమ్, డిస్క్, బ్లూటూత్‌తో కూడిన టాప్ మోడల్ డిస్క్ ఉన్నాయి. కలర్ గురించి మాట్లాడితే కంపెనీ ఈ బైక్‌లో మొత్తం 5 కలర్స్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చింది. మీరు వైట్, బ్లాక్, గ్రే, రెడ్, బ్లూ వంటి కలర్స్‌లో కొనుగోలు  చేయవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే కాల్/SMS నోటిఫికేషన్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, క్రాష్ అలర్ట్ సిస్టమ్ వంటి 28 అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. టాప్ మోడల్‌తో పోలిస్తే, మీరు డ్రమ్, డెస్క్ వేరియంట్‌లలో కొంచెం తక్కువ ఫీచర్లను చూస్తారు.

అపాచీ RTR 160 2v ఇంజన్ విషయానికొస్తే ఈ బైక్ 159.7 సీసీ, ఫోర్ స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉంటుంది. ఇది 15.53 హార్స్ పవర్, 13.9 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది. ఉత్తమ రైడింగ్ అనుభవం కోసం మీరు ఇందులో 3 మోడ్‌లు ఉన్నాయి. స్పోర్ట్, అర్బన్, రెయిన్ మోడ్ ఉన్నాయి. స్పోర్ట్ మోడ్‌లో టాప్ స్పీడ్ గంటకు 107 కిమీ. అయితే అర్బన్/ రెయిన్ మోడ్‌లో 97 కిమీ/గం.

Also Read: ఫోర్స్ మోటర్స్ నుంచి ఐదు డోర్ల SUV.. ఇక వాటికి చుక్కలే!

TVS అపాచీ RTR 160 2v టైర్లు, బ్రేకింగ్ సిస్టమ్ గురిచి చెప్పాలంటే ఫ్రంట్, బ్యాక్ టైర్లలో 17-17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. టాప్ మోడల్‌లో మీరు కొంచెం వెడల్పుగా ఉన్న వెనుక టైర్లను చూస్తారు. బ్రేకింగ్ గురించి మాట్లాడితే ముందు భాగంలో 270ఎమ్ఎమ్ పాడిల్ డిస్క్ అందుబాటులో ఉంటుంది. వెనుకవైపు డిస్క్, టాప్ వేరియంట్‌లో 200 ఎంఎం ప్యాడిల్ డిస్క్ ఉంటుంది. మీరు డిస్క్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే వెనుకవైపు 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. టాప్ వేరింట్ ధర రూ. డిస్క్ రూ. 1,22,070గా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News