Manchu Family :తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా కుటుంబాలుగా గుర్తింపు తెచ్చుకున్న ఫ్యామిలీలలో మంచు కుటుంబం (Manchu Family) కూడా ఒకటి. సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకున్న మోహన్ బాబు(Mohan Babu) మరొకవైపు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను నిర్వహిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ పేరిట కొనసాగుతున్న ఈ విద్యాసంస్థల్లో గత కొన్ని రోజులుగా అవకతవకలు జరుగుతున్నాయి అంటూ మంచు కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా నిజంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో అన్యాయం చోటుచేసుకుంది అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగానే ఈ విషయం ఉన్నత విద్యా కమిషన్ కి చేరడంతో విచారణ చేపట్టిన విద్యా కమిషన్..విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు నిజమేనని.. మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా తో పాటు ఎంబీయూ గుర్తింపును రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ALSO READ:Bigg Boss 9 Promo: కొత్త టాస్క్.. డేంజర్ జోన్ లో వారే.. తప్పెవరిది?
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఈ విషయంపై మంచు ఫ్యామిలీ రియాక్ట్ అవుతూ.. ఏకంగా హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఉన్నత విద్యా కమిషన్ బహిరంగంగా ఈ ప్రకటన చేయడం వల్ల సోషల్ మీడియాలో ఈ విషయం బాగా పాకిపోయింది. దీనివల్ల తమ పరువు పోయింది అంటూ మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున మంచు ఫ్యామిలీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఉన్నత విద్యా కమిషన్ ప్రకటనపై.. హైకోర్టును ఆశ్రయించిన మంచి ఫ్యామిలీకి.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
అసలు విషయంలోకి వెళ్తే.. తిరుపతిలో మోహన్ బాబు నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ.. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్ కి అర్హులైన విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఏకంగా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది. అయితే విచారణ జరిపి.. వస్తున్న ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది కూడా..
అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను కూడా 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే 15 లక్షల జరిమానాను మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. అలాగే యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఉన్నత విద్యా కమిషన్ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన వల్లే ఇప్పుడు తమ పరువు పోయిందని మంచు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం గమనార్హం.