Mammootty: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంటిపై ఈడి అధికారులు దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయం తమిళనాడు చెన్నైలోని ఆయన ఇంటిలోనూ, అలాగే ఆయన కంపెనీలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్‌లో ఉన్న మమ్ముట్టి కంపెనీ కార్యాలయంపై దాడి నిర్వహించారు. మొత్తం ఎనిమిది మంది ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ఈ సోదాలు చేపట్టారు.. కేవలం ఈయన ఇంటిలో మాత్రమే కాదు మలయాలు ఇండస్ట్రీలోని పలువురు స్టార్కేవలం ఈయన ఇంటిలో మాత్రమే కాదు మలయాలు ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలా ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మమ్ముట్టి ఇంటిపై దాడులు నిర్వహించడానికి అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కాస్త వివరాల్లోకి వెళితే..
మాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ తారల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు అధికారులు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకలక్కల్ వంటి నటుల ఇళ్లల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎర్నాకులం, త్రిస్సూర్, కోయంబత్తూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం వంటి ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలు, వాహన యజమానుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసినట్లు మాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి ఇంట్లోలగ్జరీ వాహనాల అక్రమ దిగుమతి జరిగినట్లు వార్తలు వినిపించడం, విదేశీ కరెన్సీ లావాదేవీల దర్యాప్తులో భాగంగా నిర్వహించినట్లు ఈడీ తెలిపింది..
Also Read : పవన్ కళ్యాణ్‌కు విలన్… 3 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
భూటాన్ ఆర్మీ ఇటీవల తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను తీసివేసింది. అయితే ఆ ఖరీదైన కార్లను కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటిని ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్‌కు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం ఈడీకి చేరింది. సినీ, వ్యాపార వర్గాల్లోని కొందరిని గుర్తించి వారి ఇళ్లల్లో సోదాల నిర్వహించినట్లు తెలుస్తుంది.. కోచ్చి జోనల్ కార్యాలయం కూడా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాల్లో ఒకేసారి దాడులు చేసింది.. మమ్ముట్టి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీపై ఈడీ దాడులు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారులు లగ్జరీ కార్ల అక్రమ రవాణా, విదేశీ మనీ లావాదేవీలపై మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం..
మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈడి అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తుంది. అయితే లగ్జరీ కార్ల గురించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది..
ఇక మమ్ముట్టి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రత్యేక పాత్రలో నటిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ని అందుకుంటున్నాడు.