Jagan Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కాలం కలిసి రాలేదా? దేవుడు వరమిచ్చినా.. పూజారి వరం ఇవ్వడం లేదా? ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చినా, కొత్త సమస్య ఎదురైందా? ఎందుకు దళిత సంఘాలు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి? ఈ నేపథ్యంలో జగన్ వెళ్లారా? డ్రాపవుతారా? అంటూ నేతలు చర్చించుకోవడం మొదలైంది.
జగన్‌కు కాలం కలిసిరావడం లేదా?
మాజీ సీఎం జగన్ నర్సీపట్నం టూర్‌పై రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవల జగన్ పర్యటనలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, పర్మిషన్ విషయంలో తొలుత రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నిబంధనలతో అనుమతి ఇచ్చారు. ఇంతకు జగన్ పర్యటన ఎందుకో తెలుసా? వైసీపీ హయాంలో ఆయన కట్టించిన మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. మాకవరపాలెంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఫిల్లర్ల వరకు మాత్రమే నిర్మించారు.
ఇప్పుడు దాన్ని పరిశీలించనున్నారు వైసీపీ అధినేత. దీని వెనుక అసలు కథ వేరేగా ఉందని ప్రత్యర్థుల నుంచి సెటైర్లు లేకపోలేదు. జగన్ నర్సీపట్నం పర్యటనకు పోలీసులు పలు షరతులతో కూడిన అనుమతి మంజూరు ఇచ్చారు. వైసీపీ ప్రతిపాదించిన రూటు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు. పోలీసుల సూచనలకు వైసీపీ నేతలు అంగీకరించడంతో కొత్త రూట్‌లో జగన్ పర్యటన సాగనుంది.
పోలీసులు పర్మీషన్ ఇచ్చినా? వారి నుంచి
ఇదే సమయంలో దళిత సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. గురువారం జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించాయి. దళిత సంఘాల వార్నింగ్‌తో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు ఆలోచనలో పడ్డారు. ఏ విధంగా అడుగులు వేయాలంటూ పార్టీ హైకమాండ్‌తో మంతనాలు సాగిస్తున్నట్లు వైసీపీ వర్గాల మాట.
ALSO READ: పాడి రైతులకు శుభవార్త
డాక్టర్ సుధాకర్ గురించి చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో నర్సీపట్నం ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉన్న సుధాకర్, తమకు మాస్క్‌లు, పీపీఈ కిట్లు ఇవ్వలేదని బహిరంగంగా ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై కన్నెర్ర చేసింది. కేసులు పెట్టి వేధించడంతోపాటు విశాఖలోని మానసిక వైద్యశాలలో ఉంచి ట్రీట్ మెంట్ అందించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ, డాక్టర్ సుధాకర్ చనిపోయారు.
ఈ వ్యవహారంపై దళిత సంఘాలు యాక్టివ్ అయ్యాయి. మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి మాజీ సీఎం జగన్ క్షమాపణ చెప్పానని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే ఆయన పర్యటనను అడ్డుకుని తీరుతామని అంటున్నారు. చేసిన పాపాలు వెంటాడుతాయంటే బహుశా ఇదేనేమో?