Ponnam And Adluri Comments: కాంగ్రెస్‌లో రాజుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి వివాదం నేటితో ముగిసంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ బ్రేక్ ఫాస్ట్ మీట్ లో ఇష్యూను సెటిల్ చేశారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదుర్చారు.
పత్రికల్లో వచ్చిన దానికి.. అడ్లూరి బాధపడితే క్షమాపణలు కోరుతున్నాను -పొన్నం..
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని సూచించారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి.. అడ్లూరి బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్టు పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు పొన్నం.
సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు..
అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తాను పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదు అన్నారు. పొన్నం ప్రభాకర్ ను గౌరవిస్తాను అని.. ఆ కామెంట్స్తో మాదిగ జాతి బాధపడిందన్నారు. ఈ సమస్య ఇప్పటితో సమసిపోయిందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
Also Read: భారత్‌ను దెబ్బకొట్టేందుకు పాక్‌తో అమెరికా సీక్రెట్ డీల్స్..
ఇకపై మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశం..
అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం క్షమాపణ చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ వివాదానికి ఇంతటిలో పుల్‌స్టాప్ పడింది. ప్రభాకర్, లక్ష్మణ్‌లిద్దరూ కష్టపడి పైకొచ్చిన నేతలని.. అన్నారు. కాంగ్రెస్ ఓ వర్గానికో, మతానికో చెందిన పార్టీ కాదు అన్నారు. మంత్రులు ఇకమీదట జాగ్రత్తగా వ్యవహరించి, మాట్లాడాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
మంత్రుల వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ..
మంత్రి అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం క్షమాపణ చెప్పారు: మహేష్ కుమార్ గౌడ్
ఈ వివాదానికి ఇంతటిలో పుల్‌స్టాప్ పడింది
పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరూ కష్టపడి పైకొచ్చిన నేతలు
కాంగ్రెస్ ఓ వర్గానికో,… https://t.co/aRJF47H9kR pic.twitter.com/jETldxkvLE
— BIG TV Breaking News (@bigtvtelugu) October 8, 2025
అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జెండా మోసిన నాకు మంత్రి గా అవకాశం ఇచ్చారు
పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాను
పొన్నం ప్రభాకర్ ను గౌరవిస్తా.. కానీ ఆయన వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది
పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో… https://t.co/6RAfEjhUB4 pic.twitter.com/SuAUWcukT2
— BIG TV Breaking News (@bigtvtelugu) October 8, 2025