Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం జన నాయగన్ సినిమాపై నీలి నీడలు పడ్డాయా అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాడు విజయ్. ఆయన చివరి చిత్రంగా జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో జననాయకుడు అనే పేరుతో రిలీజ్ కు సిద్ధమవుతుంది.
ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జననాయకుడు దిగుతున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో బాలకృష్ణ భారీ విజయాన్ని అందుకున్న నేలకొండ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా జననాయకుడు తెరకెక్కింది.
ఇక విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. జనవరి 9న జననాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి అన్నట్లు.. గత రెండు రోజుల నుంచి జననాయకుడు వాయిదా పడింది అనే వార్తలు తమిళ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం విజయ్ రాజకీయ పరిస్థితులే అని తెలుస్తుంది.
ఈ మధ్యనే విజయ్ ప్రచార కార్యక్రమంలో తొక్కి సలాట జరిగిన విషయం విదితమే. కరూర్ లో జరిగిన పార్టీ మీటింగ్ వలన 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనివలన విజయ్ పార్టీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విజయ్ సైతం లీగల్ గా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సభకు బాధ్యులైన వారిపై కేసును నమోదు అయ్యాయి ఇప్పటివరకు అయితే విజయం పోలీసులు అరెస్ట్ చేయలేదు త్వరలోనే విచారణ చేయనున్నారు. ఇలాంటి సమయంలో సినిమా రిలీజ్ అంటే జనం నుంచి విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని జననాయకుడు వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే జననాయకుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లే అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజం ఎత అనేది తెలియాల్సి ఉంది.