Lift Collapse: ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరిగిపోవడం.. తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలు చూస్తుంటే.. లిఫ్ట్ ఎక్కాలంటేనే భయం రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఛత్తీస్ గఢ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యుత్ ప్లాంట్‌లో లిఫ్ట్ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని ఓ విద్యుత్ ప్లాంట్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపారు.
పనిముగించుకున్న కార్మికులు లిఫ్ట్‌లో కిందకి వస్తుండగా.. అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సంఘటన జరిగిన ప్రదేశానకి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకొని.. మిగిలిన నిర్మాణాలు కూలిపోకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
Also Read: ఇంటర్ విద్యార్థినిపై ఘోరం.. ఆ మృగాడు వీడే, నల్గొండ జిల్లాలో దారుణం
ఈ నేపథ్యంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. కార్మికులను ప్రమాదానికి గురిచేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.