Nalgonda Crime: పని పాటా లేని కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. బాలిక కనిపిస్తే చాలు రాక్షసుల మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ అదే చేశాడు. ప్రేమ పేరుతో ఇంటర్ స్టూడెంట్‌ని నమ్మించాడు. మాయమాటలతో ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
నల్గొండ జిల్లాలో దారుణం
నల్గొండ పట్టణంలోని శివారు గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆ గ్రామానికి చెందిన బాలిక బంధువులకు ట్రాక్టర్ ఉంది. పొరుగు గ్రామానికి చెందిన 22 ఏళ్ల కృష్ణ ఆ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే విద్యార్థిని తన బాబాయి ఇంటికి వచ్చినప్పుడల్లా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమగా మార్చే ప్రయత్నం చేశాడు.
నువ్వు లేని లోకంలో తాను లేనని బాలికను నమ్మించాడు. నిజమేనని నమ్మేసింది. కానీ కామాంధుడి మాటల వెనుక మాయలను అర్థం చేసుకోలేకపోయింది. మంగళవారం ఉదయం బాలిక ఇంటి నుంచి కాలేజీకి బయలు దేరింది. నల్గొండ పట్టణానికి వచ్చిన తర్వాత తన స్నేహితుడు మధుని పంపించి బాలికను రప్పించాడు కృష్ణ. డైట్ కళాశాలకు సమీపంలో ఉంటున్న మధు, తన రూమ్‌కి బాలికను ఆటోలో తీసుకెళ్లాడు.
ఇంటర్ స్టూడెంట్‌ని ప్రేమ పేరుతో
ఆ తర్వాత బాలికపై కృష్ణ అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తాను అయిపోతానని భావించి దారుణంగా హత్య చేశాడు. స్థానికుల ద్వారా ఈ విషయం బాలిక తల్లిదండ్రులు తెలిసింది. ఆ తర్వాత నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కృష్ణ, వాడికి సహకరించిన మధులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రక్తస్రావం వల్ల బాలిక మరణించిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ALSO READ: చున్నీతో ఉరేసి.. ఫెన్సింగ్ రాయితో భార్యని చంపిన భర్త
విద్యార్థిని విషయం తెలియగానే పలు విద్యార్థి సంఘాలు, మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు జనరల్ ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. ఈ ఘటనలో ఇంకెవరి పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కృష్ణపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.