BigTV English

Mass Jathara: నీలో ఏదో ఉందే లీల.. చేసిందే నన్నే ఇలా.. హుడియో హుడియో సాంగ్ అదిరిపోయింది

Mass Jathara: నీలో ఏదో ఉందే లీల.. చేసిందే నన్నే ఇలా.. హుడియో హుడియో సాంగ్ అదిరిపోయింది

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. గతేడాది నుంచి రవితేజ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రవితేజతో పాటు శ్రీలీల కూడా హిట్ కోసం ఎదురుచూస్తుంది. వీరిద్దరూ కలిసి నటించిన ధమాకా మంచి విజయాన్ని అందుకుంది. దాని తరువాత మాస్ జాతర సినిమాతో అక్టోబర్ 31 న  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మంచి హైప్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఓలే ఓలే సాంగ్ అయితే వివాదాలను కూడా తీసుకొచ్చింది. ఇందులో బూతులు ఎక్కువ ఉన్నాయని, ఇదేం పాట అని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఆ సాంగ్ తరువాత తాజాగా మరో లవ్ సాంగ్ ను మేకర్స్ మాస్ జాతర సినిమా నుంచి రిలీజ్ చేశారు. హుడియో హుడియో అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చాలా ఫ్రెష్ గా ఉంది. చాలా రోజుల తరువాత ఒక మంచి లవ్ సాంగ్ విన్న ఫీల్ కలుగుతుంది.

ముఖ్యంగా దేవ్ అందించిన లిరిక్స్ చాలా క్యాచీగా.. మంచి రైమింగ్ తో అదిరిపోయాయి. నీలో ఏదో ఉందే లీల.. చేసిందే నన్నే ఇలా, చిట్టి చిలకా.. చిన్ని మొలక.. పెట్టి వెళ్ళాకా.. నా గుండె మెలిక అంటూ వచ్చే లిరిక్స్ అయితే అందరికీ నోటెడ్ అయిపోతాయి. ఇక లిరిక్స్, మ్యూజిక్ ఒక ఎత్తు అయితే.. రవితేజ వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్. ఆ చిన్న చిన్న స్టెప్స్ చాలా స్మూత్ గా వేసేశాడు. చూడడానికి ఎంతో బావున్నాయి.


ఇక శ్రీలీల అందం అస్సలు ఫ్యాన్స్ ను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. లంగా ఓణీ లో నిండుగా తెలుగింటి ఆడపిల్లలా ఎంతో అందంగా కనిపించింది. వీటితో పాటు విజువల్స్ చాలా అంటే చాలా బావున్నాయి. కొండకోనల మధ్య.. పల్లెటూరి వాతావరణాలు.. రైల్వే స్టేషన్ లాంటివి బాగా క్యాప్చర్ చేశారు.  మొత్తంగా ఈ సాంగ్ మాత్రం మాస్ జాతరకే హైలైట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.మరి ఈ సినిమాతో రవితేజ, శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Kantara Chapter1: 400 కోట్లక్లబ్ లోకి కాంతార1 .. ఆగని కలెక్షన్ల సునామీ!

Manchu Family : మా పరువు తీశారు.. యూనివర్సిటీ సీజ్‌పై మంచు ఫ్యామిలీ రియాక్షన్

ED Raids : ఇండస్ట్రీలో ఈడీ దాడులు… హీరోలే టార్టెట్..

Rajvir Jawanda: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి

Pooja Hegde: ఒక్క హిట్ లేదు కానీ.. డిమాండ్ కు మాత్రం తక్కువ లేదు

Jana Nayagan: తొక్కిసలాట ఎఫెక్ట్.. జన నాయగన్ వాయిదా .. ?

MAD 3: సైలెంట్ గా షూటింగ్ మొదలైన మ్యాడ్ క్యూబ్.. రిలీజ్ అప్పుడే?

Big Stories

×