టెక్ దిగ్గజం స్మార్ట్ ఫోన్ మరో క్రేజీ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సామ్ సంగ్ ట్రై-ఫోల్డ్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను రెడీ చేస్తోంది. ఇది ఫోన్, టాబ్లెట్ తో పాటు ట్రై యాప్ మల్టీ టాస్కింగ్ లాంటి ఫార్మాట్ లోకి మారుతుంది. ఈ డివైజ్ ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ అందుబాటులోకి వచ్చింది. ట్రై ఫోల్డ్ ఫోన్ కోసం యాప్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఉచిత ప్రీమియం జెమినిని పొందడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాలో ఈ స్మార్ట్ ఫోన్ కనిపించింది. గూగుల్ యాప్ లో దీనిని 2025 సామ్ సంగ్ ట్రైఫోల్డ్ పేరుతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ సంగ్ హార్డ్ వేర్ ను విడుదల చేయడానికి దాదాపు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ రెండు ఇన్ వర్డ్ హింగ్స్ ను కలిగి ఉంటుంది. రెండుసార్లు ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే సుమారు 10 అంగుళాల వరకు ఉంటుంది. ఇది ఫోన్ ను కంప్లీట్ గా ఓపెన్ చేసినప్పుడు 6.5 ఇంచుల డిస్ ప్లే కూడా ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్ శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఒకేసారి మూడు యాప్ లను పక్కపక్కనే ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ స్మార్ట్ ఫోన్ లో లేని మాదిరి కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫో, ఫోల్డబుల్ రంగంలో కొత్త ట్రెండ్ ను సృష్టించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ వారం APEC సమ్మిట్ లో సామ్ సంగ్ తన హార్డ్ వేర్ ను ప్రదర్శించబోతోంది. లాంచ్ ప్లాన్ల గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గూగుల్ యాప్ ఈ కొత్త 16.43.60.sa.arm64 బిల్డ్ ను పరిశీలిస్తే, ఉచిత జెమిని ప్రమోషన్లకు అర్హత ఉన్న డివైజెస్ లిస్టులో ట్రై ఫోల్డ్ నిలిచింది. హై ప్రొఫైల్ సామ్ సంగ్ ఫోన్లు అన్నింటిలో ఇవి కనిపిస్తున్నాయి. S25 సిరీస్ లన్నీ ఉచిత జెమిని ప్రోమోలను పొందుతున్నాయి.
మరోవైపు సామ్ సంగ్ ట్రై ఫోల్డ్ అమ్మకాలను ఎప్పటి నుంచి ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది లోనే ఈ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే, తొలుత ఈ స్మార్ట్ ఫోన్ ను సౌత్ కొరియాలో విడుదల చేయనుంది. ఆ తర్వాతే యుఎస్ సహా ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: రూ.15వేల స్మార్ట్ వాచ్ ఇప్పుడు కేవలం రూ.999కే.. అమెజాన్‌లో మళ్లీ షాక్ ఆఫర్