Chennai Crime: చెన్నైలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, ఈ కేసులో లోతుల్లోకి వెళ్లే..
చెన్నైలో దారుణం
చెన్నైలో రెండురోజుల కిందట పక్కికరనై ప్రాంతంలో ఉన్న ఓ మహిళ, తన ఫ్రెండ్‌ని కలిసేందుకు ఓ యాప్‌లో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. డ్రైవర్‌గా వచ్చిన శివకుమార్‌ను తాను తిరుగు ప్రయాణం కోసం వెయిట్ చేయాలని కోరింది. తిరిగి ఆమెని ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లాడు డ్రైవర్ శివకుమార్. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మెడ పట్టుకుని చంపేస్తానని బెదిరించాడు.
ఘటన తర్వాత బాధితురాల్ని ఇంటి వద్ద దించేశాడు బైక్ డ్రైవర్. దారుణమైన ఘటనను బాధిత మహిళ, తనకు భర్త దృష్టి తెచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దంపతులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వేధింపులు చేసిన మాట వాస్తవమేనని నిర్థారించారు పోలీసులు. చివరకు నిందితుడు శివకుమార్‌ను గుర్తించి, అరెస్ట్ చేశారు పోలీసులు.
మహిళపై లైంగిక దాడి చేసిన బైక్ డ్రైవర్
ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరిచారు పోలీసులు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. అంతేకాదు నిందితుడి మోటార్ సైకిల్‌ని సీజ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు స్పందించారు. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరోపణలను అధికార డీఎంకే ప్రభుత్వం ఖండించింది.
ALSO READ: విమానంలో భారతీయుడు వీరంగం.. ఇద్దరు టీనేజర్లపై దాడి
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. విచారణ వేగం చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పింది. తమిళనాడులో అసలే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న అస్త్రం దొరికినా దాన్ని విపక్షాలు లేవనెత్తున్నాయి.